AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahabharat: సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ‘మహాభారత్’ నటుడు హఠాన్మరణం.. ఏమైందంటే?

సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుకుంది. బాలీవుడ్ ప్రముఖ నటుడు మహా భారత్ సీరియల్ ఫేమ్ పంకజ్ ధీర్ (68) హఠాత్తుగా కన్నుమూశారు. బుధవారం (అక్టోబర్ 15) ఉదయం 11 గంటల సమయంలో ఆయన తుది శ్వాస విడిచారని కుటుంబీకులు, సన్నిహితులు వెల్లడించారు.

Mahabharat: సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. 'మహాభారత్' నటుడు హఠాన్మరణం.. ఏమైందంటే?
Mahabharat Serial Actor Pankaj Dheer
Basha Shek
|

Updated on: Oct 15, 2025 | 4:05 PM

Share

‘మహాభారతం’ హిందీ టీవీ సీరియల్ లో కర్ణుడి పాత్రను పోషించి అందరి మన్ననలు అందుకున్న పంకజ్ ధీర్ కన్నుమూశారు. ఆయన స్నేహితుడు అమిత్ బహల్ ఈ విషాద వార్తను ధ్రువీకరించారు. పంకజ్ చాలా ఏళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. శస్త్ర చికిత్సలు కూడా చేయించుకుని ఈ మహమ్మారిని జయించారు. కానీ కొన్ని నెలల క్రితం మళ్లీ ఆయనకు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీనికి ట్రీట్మెంట్ తీసుకుంటూనే కన్నుమూశారు పంకజ్. బుధవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఆయన తుది శ్వాస విడిచారు. పంకజ్ మరణ వార్త బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది. ‘మహాభారతం’లో అర్జున్ పాత్ర పోషించిన నటుడు ఫిరోజ్ ఖాన్ స్పందిస్తూ.. ‘ పంకజ్ ఇక లేరన్నది నిజమే. వ్యక్తిగతంగా, నేను నా ప్రాణ స్నేహితుడిని కోల్పోయాను. ఒక వ్యక్తిగా, ఆయన చాలా మంచివాడు. ఆయన కన్నుమూశారంటే ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను’ అని వాపోయారు.

పంకజ్ ధీర్ ఇప్పటివరకు అనేక సీరియల్స్, సినిమాల్లో నటించారు. కానీ బి.ఆర్. చోప్రా ‘మహాభారత్’ సీరియల్ ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది. అందులో పంకజ్ కర్డుడి పాత్ర లో బాగా ఇమిడిపోయారని ప్రశంసలు వచ్చాయి. ‘చంద్రకాంత’లో శివదత్ పాత్ర కూడా బాలీవుడ్ ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది. ‘బాధో బహు’, ‘యుగ్’, ‘ది గ్రేట్ మరాఠా’, ‘అజుని’ తదితర హిందీ సీరియల్స్ లోనూ పంకజ్ నటించారు. అలాగే ‘సోల్జర్’, ‘తుమ్కో నా భూల్ పెంగే’, ‘రిష్టే’, ‘అందాజ్’, ‘సడక్’, ‘బాద్షా’ వంటి సినిమాల్లోనూ కనిపించారు.

ఇవి కూడా చదవండి

కాగా ముంబైలోని విలే పార్లేలోని శ్మశానవాటికలో సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో పంకజ్ అంత్యక్రియలు జరగనున్నాయి. పంకజ్ కు భార్య అనితా ధీర్, కుమారుడు నికితాన్ ధీర్ లు ఉన్నారు. కుమారుడు నికితాన్ కూడా సినిమాలు, సీరియల్స్ లో నటిస్తున్నాడు. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’లో తంగబలి పాత్రలో అందరి దృష్టిని ఆకర్షించాడు. తెలుగు సినిమాల్లోనూ విలన్ గా నటించాడు. ఇక నికిత్ తన తండ్రిలాగే పౌరాణిక సీరియల్స్‌లో కూడా పనిచేశారు. ‘శ్రీమద్ రామాయణం’ సీరియల్‌లో రావణుడి పాత్రను పోషించారు. అతని భార్య, పంకజ్ కోడలు కృతికా సెంగర్ కూడా ఒక నటినే.

ప్రముఖుల నివాళులు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..