AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venu Swamy: మాంసం, మద్యంతో నైవేద్యం.. నీటిపై తేలియాడుతూ వేణుస్వామి పూజలు.. దేనికోసమే తెలిస్తే షాక్ అవుతారు

ఇటీవలే ఓ ప్రముఖ ఆలయానికి వెళ్లిన వేణు స్వామిని అక్కడి అర్చకులు, ఆలయాధికారులు గుడిలోకి రాకుండా అడ్డుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట బాగా వైరలయ్యాయి. ఇప్పుడు మరోసారి తన పూజలతో వార్తల్లో నిలిచారు వేణు స్వామి. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట బాగా వైరలవుతోంది.

Venu Swamy: మాంసం, మద్యంతో నైవేద్యం.. నీటిపై తేలియాడుతూ వేణుస్వామి పూజలు.. దేనికోసమే తెలిస్తే షాక్ అవుతారు
Astrologer Venu Swamy
Basha Shek
|

Updated on: Oct 14, 2025 | 10:34 PM

Share

వేణు స్వామి.. ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రిటీల జాతకాలు చెబుతూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారీ స్వామీజీ. సమంత, నయన తార, ప్రభాస్, రష్మిక, విజయ్ దేవరకొండ, రకుల్ ప్రీత్ సింగ్, నాగ చైతన్య, శోభిత.. ఇలా చాలా మంది సెలబ్రిటీల గురించి చెబుతూ వివాదాల్లో నిలిచారు వేణు స్వామి. అదే సమయంలో ఆయన చేసే పూజలు కూడా తరచూ వివాదాస్పదమవుతున్నాయి. సంతానం లేనివారు ప్రముఖ కామాఖ్య ఆలయం కొండపైన కలిస్తే ఏడాదిలోపు పిల్లలు పుడతారంటూ ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. అంతేకాదు అక్కడ పూజలు నిర్వహించేటప్పుడు అమ్మవారికి నైవేద్యంగా మాంసాహారం సమర్పిస్తాంచాలనడం కామాఖ్య ఆలయ అర్చకుల ఆగ్రహానికి కారణమైంది. ఈ కారణంగానే వేణు స్వామిని ఆలయంలోకి రాకుండా అడ్డుకున్నారు. తాజాగా మరోసారి తన పూజలతో వార్తల్లో నిలిచారీ ఫేమస్ ఆస్ట్రాలజర్. వటుక భైరవ పేరుతో పూజలు చేసిన ఆయన స్వామి వారికి మాంసం, మద్యం నైవేద్యంగా సమర్పించారు. ఆ తర్వాత వాటన్నింటినీ హోమంలో వేసి ఆహుతి ఇచ్చారు.

కాగా ఈ వటుక భైరవ పూజ గురించి పలు ఆసక్తకర విషయాలు చెప్పారు వేణుస్వామి. ఈ పూజ ఎవరి పేరు మీద అయితే చేస్తామో వారికి కోర్టు వ్యవహారాలు, రాజకీయ వ్యవహారాలు, డబ్బు పరంగానూ విజయం సిద్ధిస్తుందన్నారు. అలాగే శత్రువుల పీడ కూడా విరగడవుతుందని చెప్పుకొచ్చారు.  అయితే ఈ వటుక భైరవ పూజా కార్యక్రమంలో తప్పకుండా స్వామి వారికి తప్పకుండా మద్యం, మాంసం నైవేద్యంగా సమర్పించాలని వేణు స్వామి తెలిపారు.

ఇవి కూడా చదవండి

 వటుక భైరవ పూజలో వేణు స్వామి.. వీడియో ఇదిగో..

అయితే ఈ  పూజా ఫలితం దక్కాలంటే పూజ చివరిలో నీటి మీద తేలియాడుతూ వటుక భైరవ పూజకు సంబంధించిన మంత్రాలను జపించాలన్నారు వేణు స్వామి. అందుకు తగ్గట్టుగానే పూజ అనంతరం ఫామ్ హౌస్ లోనే ఉన్న స్విమ్మింగ్ పూల్ నీటిపై తేలియాడుతూ వటుక భైరవ మంత్రాలను జపించారీ స్వామీజీ.   ఇందుకు సంబంధించిన ఈ వీడియోని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు వేణుస్వామి. దీంతో అది కాస్తా నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.  ముఖ్యంగా మాంసం మద్యం దేవుడికి నైవేద్యంగా పెట్టడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్
అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్
ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా