Bigg Boss Telugu 9: హౌస్‌మేట్స్‌ను హడలెత్తిస్తోన్నదివ్వల మాధురి.. ఓటింగ్ ఇలా.. డేంజర్ జోన్‌లో ఉన్నదెవరంటే?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లోకి వైల్డ్ కార్డు ఎంట్రీగా అడుగుపెట్టిన దివ్వల మాధురి చిన్న దానికి కూడా నోటికి పని చెబుతోంది. సమయం, సందర్భమనేది లేకుండా ఎవరిని పడితే వాళ్లను తిట్టేస్తోంది. ముఖ్యంగా మాధురి తీరుతో బిగ్ బాస్ హౌస్ మేట్స్ హడలిపోతున్నారనిపిస్తోంది.

హోస్ట్ నాగార్జున చెప్పినట్లుగానే వైల్డ్ కార్డ్స్ ఎంట్రీతో బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ రణరంగంగా మారింది. ఆదివారం నాడు దివ్వల మాధురి, అయేషా జీనత్, శ్రీనివాస్ సాయి, రమ్య మోక్ష, నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా వైల్డ్ కార్డు ఎంట్రీలుగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు. ‘వైల్డ్’ కార్డ్ అనే పేరుకు తగ్గట్టుగానే మాధురి, జీనత్ మరీ వైల్డ్ గా ప్రవర్తిస్తున్నారు. మరీ ముఖ్యంగా దివ్వల మాధురి చిన్నదానికి కూడా తోటి కంటెస్టెంట్స్ తో గొడవకు దిగుతోంది. హౌస్ లోకి రాగానే రాము రాథోడ్ పై గట్టిగా అరిచేసిన ఆమె సంజయ్ గల్రానీని దొంగగా ముద్రేసింది. అలాగే దివ్య నికితాపై కూడా ఫైర్ అయ్యింది. ఇక ఫుడ్ విషయంలోనూ దివ్యపై నెగెటివ్ కామెంట్స్ చేసింది మాధురి. కెప్టెన్ కల్యాణ్ నచ్చజెప్పాలని చూసినా ఆమె మాట వినడం లేదు.మొత్తానికి మాధురి ‘వైల్డ్’ బిహేవియర్ తో బిగ్ బాస్ హౌస్ మేట్స్ హడలెత్తిపోతున్నారని తెలుస్తోంది.
ఇక ఆరో వారం ఎలిమినేషన్ కు సంబంధించి మొత్తం ఆరుగురు నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం. దివ్య నిఖిత, రాము రాథోడ్, భరణి, డీమాన్ పవన్, సుమన్ శెట్టి, తనూజ పుట్టస్వామి ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు. వీరికి ఆన్ లైన్ ఓటింగ్ కూడా జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం తనూజ పుట్టస్వామి టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. సుమన్ శెట్టి రెండో ప్లేస్ లో ఉండగా, డిమాన్ పవన్ మూడో ప్లేస్ లో కొనసాగుతున్నాడు. ఇక నాలుగో ప్లేస్ లో భరణి ఉండగా, ఐదో స్థానంలో దివ్య నికితా ఉంది. ఆఖరి ప్లేస్ లో ఫోక్ సింగర్ రాము రాథోడ్ ఉన్నాడు. అంటే ప్రస్తుత రామూనే డేంజర్ జోన్ లో ఉన్నాడన్నమాట. ఇంకా ఓటింగ్ కు చాలా సమయం ఉంది. కాబట్టి లెక్కలు మారే అవకాశముంది. ఒకవేళ ఇదే ట్రెండ్ కొనసాగితే మాత్రం రామునే ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలున్నాయి.
బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో..
Laughter’s louder than ever! The house turns into a funstorm! ⚡😂
Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar#BiggBossTelugu9 #StreamingNow #StarMaaPromo pic.twitter.com/AjcOhJ6zdM
— Starmaa (@StarMaa) October 15, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








