AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌.. ఎట్టకేలకు ఓటీటీలోకి 300 కోట్ల సినిమా.. అధికారిక ప్రకటన.. తెలుగులోనూ స్ట్రీమింగ్

ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధించింది. కేవలం రూ. 30 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా ఓవరాల్ గా రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఐఎమ్ డీబీలోనూ ఈ మూవీకి టాప్ రేటింగ్ దక్కింది.

OTT Movie: వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌.. ఎట్టకేలకు ఓటీటీలోకి 300 కోట్ల సినిమా.. అధికారిక ప్రకటన.. తెలుగులోనూ స్ట్రీమింగ్
Ott Movie
Basha Shek
|

Updated on: Oct 24, 2025 | 6:22 PM

Share

థియేటర్లలో రిలీజ్ కు ముందు ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు లేవు. స్టార్ హీరోలు లేరు. పైగా చిన్న సినిమా ట్యాగ్. పెద్దగా ప్రమోషన్లు కూడా చేయలేదు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ చిన్న సినిమానే బాక్సాఫీస్ ను షేక్ చేసింది. స్టార్ హీరోల సినిమాలను వెనక్కు నెడుతూ భారీ వసూళ్లు రాబట్టింది. ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు, అబ్బుర పరిచే యాక్షన్ సీన్స్, ఊహించని ట్విస్టులు సినిమాలకు కాసుల వర్షం కురిపించాయి. కేవలం రూ. 30 కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టి తీసిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇందులో భాగమైన యాక్టర్స్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. మలయాళంలో ఇప్పటికీ చాలా చోట్ల ఈ సినిమా థియేటర్లలో ఆడుతోంది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమాను ఎప్పుడెప్పుడు ఓటీటీలో చూద్దామా? అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వారి నిరీక్షణకు తెర పడింది. త్వరలోనే ఈ సెన్సేషనల్ మూవీ ఓటీటీలోకి రానుంది. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఆ సినిమా మరేదో కాదు. కల్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించిన ‘లోక ఛాప్టర్ 1చంద్ర‌’ (తెలుగులో కొత్త లోక)

ఆగ‌ష్టు 28న థియేటర్లలో విడుదలైన రిలీజైన కొత్త లోక సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ తో పాటు ప్రేమలు మూవీ ఫేమ్ నస్లేన్, డాన్స్ మాస్టర్ శాండీ, విజయరాఘవన్, సంధు సలీంకుమార్, రఘునంద పలేరి, శివాజిత్ పద్మనాభన్, జైన్ ఆండ్రూస్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. దుల్కర్ సల్మాన్, టోవినో థామస్, షౌబిన్ అతిథి పాత్రల్లో మెరిశారు. దుల్కర్ సల్మాన్ ఈ సినిమాను నిర్మించడం విశేషం. తాజాగా కొత్త లోక స్ట్రీమింగ్‌ పై అఫీషియల్ అనౌన్సె మెంట్ వచ్చింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ కొనుగోలు చేసింది. ఈ మేరకు త్వరలోనే ఈ సినిమా ఓటీటీకి రానుందని జియో హాట్ స్టార్ అధికారికంగా ప్రకటించింది. కచ్చితమైన తేదీ ప్రకటించలేదు కానీ త్వరలోనే రిలీజ్ తేదీని రివీల్ చేస్తామని పోస్టర్‌ పంచుకున్నారు. బహుశా దీపావళి కానుకగా కొత్త లోక ఓటీటీలోకి రావొచ్చునని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
జపాన్‌లో భారత షూటర్లకు తప్పని ఆ ఇబ్బందులు..!
జపాన్‌లో భారత షూటర్లకు తప్పని ఆ ఇబ్బందులు..!
చాణక్య నీతి :పేరెంట్స్ 15 ఏళ్ల పిల్లలకు నేర్పాల్సిన మనీసూత్రాలివే
చాణక్య నీతి :పేరెంట్స్ 15 ఏళ్ల పిల్లలకు నేర్పాల్సిన మనీసూత్రాలివే
జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారా? ఇలా పీతల సూప్‌ తాగితే చాలు!
జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారా? ఇలా పీతల సూప్‌ తాగితే చాలు!
రేకుల షెడ్డు లీకేజీలతో ఇబ్బందా? తక్కువ ఖర్చుతో బెస్ట్ ట్రిక్
రేకుల షెడ్డు లీకేజీలతో ఇబ్బందా? తక్కువ ఖర్చుతో బెస్ట్ ట్రిక్
డాక్టర్ చనిపోయే ముందు హైవేపై ఏం జరిగింది..? నెట్టింట వీడియో వైరల్
డాక్టర్ చనిపోయే ముందు హైవేపై ఏం జరిగింది..? నెట్టింట వీడియో వైరల్
జపాన్ వెళ్లిన టీమిండియా.. అభిషేక్ శర్మ లగేజ్ చూశారా..?
జపాన్ వెళ్లిన టీమిండియా.. అభిషేక్ శర్మ లగేజ్ చూశారా..?
చిన్నపిల్లలకు ఇచ్చే దగ్గు మందు సీసాలపై కేంద్రం హెచ్చరిక!
చిన్నపిల్లలకు ఇచ్చే దగ్గు మందు సీసాలపై కేంద్రం హెచ్చరిక!
రష్యాపై ఉక్రెయిన్ కీలక నిర్ణయం..రాత్రికి రాత్రే ఏం చేసిందో తెలుసా
రష్యాపై ఉక్రెయిన్ కీలక నిర్ణయం..రాత్రికి రాత్రే ఏం చేసిందో తెలుసా
బాడీలోని కొవ్వును కరిగించే మొనగాడు ఆకు.. షుగర్ కూడా కంట్రోల్
బాడీలోని కొవ్వును కరిగించే మొనగాడు ఆకు.. షుగర్ కూడా కంట్రోల్
మీ UPI పిన్ సురక్షితంగా మార్చుకోవడం లేదా రీసెట్ చేయడం ఎలా?
మీ UPI పిన్ సురక్షితంగా మార్చుకోవడం లేదా రీసెట్ చేయడం ఎలా?