AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీవీ రియాల్టీ షోలో నటి పెళ్లి.. ట్రోలర్స్‌కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన కొత్త జంట!

Avika Gor Slams Those Trolling Her Wedding Look: ఇటీవల న‌టి అవికా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రియుడు మిళింద్ చంద్వానితో క‌లిసి ఆమె ఏడ‌డగులు వేసింది. అయితే ఆమె ఓ టీవీ రియాలిటీ షో 'పతి పత్ని ఔర్ పంగా' లో పెళ్లి చేసుకోవడం సర్వత్రా చర్చణీయాంశంగా మారింది. అంతేకాకుండా ఆమె వెడ్డింగ్‌ లుక్‌ కూడా జనాలకు సుతారం నచ్చలేదు. దీంతో నెట్టింట ట్రోల్స్‌ మొదలైనాయి. ఈ క్రమంలో కొత్త జంట విమర్శలపై ఘాటుగా స్పందించింది..

టీవీ రియాల్టీ షోలో నటి పెళ్లి.. ట్రోలర్స్‌కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన కొత్త జంట!
Avika On Her National Shaadi
Srilakshmi C
|

Updated on: Oct 15, 2025 | 6:06 PM

Share

బుల్లితెరపై చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో మెరిసిన నటి అవికా గోర్‌ అశేష అభిమానులను సొంతం చేసుకుంది. పలు భాషల్లో వచ్చిన ఈ సీరియల్‌తో అవికా ఒక్కసారిగా దేశ‌వ్యాప్తంగా పాపులరైంది. ఇక ఇటీవల న‌టి అవికా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రియుడు మిళింద్ చంద్వానితో క‌లిసి ఆమె ఏడ‌డగులు వేసింది. అయితే ఆమె ఓ టీవీ రియాలిటీ షో ‘పతి పత్ని ఔర్ పంగా’ లో పెళ్లి చేసుకోవడం సర్వత్రా చర్చణీయాంశంగా మారింది. అంతేకాకుండా ఆమె వెడ్డింగ్‌ లుక్‌ కూడా జనాలకు సుతారం నచ్చలేదు. దీంతో నెట్టింట ట్రోల్స్‌ మొదలైనాయి. ఈ జంట పెళ్లిని త‌ప్పుబ‌డుతూ సోషల్ మీడియాలో వరుస కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ విమ‌ర్శ‌ల‌పై అవికా తాజాగా ఘాటుగా స్పందించింది.

టీవీ షోలో పెళ్లిచేసుకోవ‌డం అనేది త‌న చిన్ననాటి కోరిక అని, ఇందులో త‌న భర్త మిళింద్ చంద్వాని అభిప్రాయమే తనకు ముఖ్యమని, ఇతరుల విమర్శలను తాను పట్టించుకోనని ఆమె తేల్చి చెప్పింది. పెళ్లిలో అవికా లుక్‌పై వచ్చిన విమర్శల గురించి ఓ టీవీ షోలో మాట్లాడుతూ.. ‘టీవీ కార్యక్రమంలో పెళ్లి చేసుకోవాలనే నా నిర్ణయాన్ని మిళింద్‌కు చెప్పినప్పుడు తను అంగీకరించాడు. డబ్బు కోసమే ఇలా చేస్తున్నామని జనాలు విమర్శించే అవకాశం ఉందని మిళింద్‌ ముందే చెప్పాడు. కానీ నా నిర్ణయంపై మేమిద్దరం సంతోషంగానే ఉన్నాం. మిళింద్ అంగీకరించడమే నాకు ముఖ్యం. జ‌నాలు ఏమనుకుంటానేది నేను పట్టించుకోను. నా పెళ్లి మొత్తం సంప్రదాయబద్ధంగా జరిగింది. అందుకే కొందరు నా వెడ్డింగ్ లుక్‌పై ట్రోల్స్ చేస్తున్నారు. నా వెడ్డింగ్‌ లుక్‌లో ప్రతిదీ నాకు పర్ఫెక్ట్‌గా అనిపించింది. అయితే విమర్శించే వారు దేనినైనా ప్రతికూలంగానే చూస్తారు. ఒకవేళ ఈ ట్రోల్స్ నా భర్త లుక్‌పై వచ్చి ఉంటే అప్పుడు నేను తప్పకుండా బాధపడేదాన్ని. ఎందుకంటే అతని లుక్‌ను డిజైన్ చేసింది నేను కాబట్టి. అలా రానందుకు ఆనందంగా ఉంది. కానీ నా గురించి అయితే నేను పట్టించుకోను. నేను ఎలా ఉన్నా నాకు సంతోషమే. కాబట్టి దేన్ని పట్టించుకోనని అవికా చెబితే.. మిలింద్‌ మరో మెట్టు ఎక్కి తన భార్య వెడ్డింగ్‌ లుక్‌ను తెగ పొగిడేశాడు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by ColorsTV (@colorstv)

ప్రపంచం ఏమి చెబుతుందో నేను పట్టించుకోను. అవికా లుక్‌ను ఒకసారి కాదు మూడు సార్లు చూసి ఏడ్చాను. అవికా నాకు అంత అందంగా కనిపించింది. మీ అభిప్రాయాలు మీ దగ్గర ఉంచుకోండి. కానీ మేము చాలా సంతోషంగా ఉన్నామని దిమ్మతిరిగేలా ట్రోలర్స్‌కి కౌంటర్‌ ఇచ్చాడు. ఈ రోజుల్లో కనీసం 50 మంది ఫొటోగ్రాఫర్లు, వీడియో రికార్డ్ చేసేవారు లేకుండా ఏ పెళ్లి జరగడం లేదు. అందరి పెళ్లిళ్లలో ఇలాంటివి చేస్తున్నారు. ఒకే ఒక్కతేడా ఏమిటంటే అవికా మంచి ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశాడు.

కాగా ‘పతి పత్ని ఔర్ పంగా’ అనే హిందీ రియాలిటీ షోలో సెప్టెంబర్‌ 30న అవికా, మిలింద్‌ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రోగ్రాం టీవీలో ఇంకా ప్రసారం కాలేదు. ఈ జంట వివాహం షో సెట్స్‌లో సాంప్రదాయ సెటప్‌లో జరిగింది. వీరి వివాహానికి పలువురు నటీనటులు, ఇరువురి సన్నిహిత కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఇక ఈ ఈవెంట్‌ టీజర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో ‘మిల్‌కా కే షాదీ కే లియే ఆయా హై సబ్‌కో బులావా, క్యా ఇస్ హసీన్ పాల్ కే లియే ఆప్ సబ్ హై తయ్యార్?” అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాలో కలర్స్‌ టీవీ షేర్ చేసింది.

మరిన్ని సినిమా కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.