RRC Railway Jobs 2025: పదో తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఎలాంటి రాత పరీక్ష లేదు
జైపుర్ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ).. నార్త్ వెస్ట్రన్ రైల్వే (NWR) ఎన్‌డబ్ల్యూఆర్ పరిధిలో వర్క్‌షాప్, యూనిట్‌లలో భారీగా యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం..

రాజస్థాన్ రాష్ట్రంలోని జైపుర్ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ).. నార్త్ వెస్ట్రన్ రైల్వే (NWR) ఎన్‌డబ్ల్యూఆర్ పరిధిలో వర్క్‌షాప్, యూనిట్‌లలో భారీగా యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 2,094 ఖాళీలను భర్తీ చేయనుంది. డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్ (అజ్‌మేర్), డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్ (బికనీర్), డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్ (జైపుర్), డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్ (జోధ్‌పుర్), బీటీసీ క్యారేజ్ (అజ్‌మేర్), బీటీసీ లోకో (అజ్‌మేర్), క్యారేజ్ వర్క్స్ షాప్ (బికనీర్), క్యారేజ్ వర్క్స్ షాప్ (జోధ్‌పుర్).. వర్క్‌షాప్‌లు, యూనిట్లలో ఈ ఖాళీలను భర్తీ చేయనుంది.
యాక్ట్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు కనీసం 50 శాతం మార్కుల పదో తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. ఎలక్ట్రికల్, కార్పెంటర్, పెయింటర్, మేసన్, పైప్ ఫిట్టర్, ఫిట్టర్, కార్పెంటర్, డీజిల్ మెకానిక్, వెల్డర్, మెకానికల్, డీజిల్ మెకానికల్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్ తదితర ట్రేడుల్లుల్లో ఖాళీలు ఉన్నాయి. అభ్యర్ధుల వయోపరిమితి నవంబర్ 02, 2025 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 2, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద జనరల్ అభ్యర్ధులు రూ.100 చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇతర వివరాలు ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
నార్త్ వెస్ట్రన్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




