Rats at Home: చంపకుండానే.. మీ ఇంటి నుంచి ఎలుకల్ని శాశ్వతంగా తరిమికొట్టే చిట్కా!
చాలా మందికి ఎలుకలంటే పట్టరానంత భయం. పైగి ఇవి ఒక్కసారి ఇంట్లోకి ప్రవేశించాయంటే ఓ పట్టాన బయటకు పోవు. దీంతో ఎలుకలను ఎలా వదిలించుకోవాలో తెలియక చాలా మంది తెగ ఇబ్బంది పడిపోతుంటారు. ఈ కింది సింపుల్ ట్రిక్స్‌తో మీ ఇంటి నుండి ఎలుకలను సులువుగా తరిమికొట్టవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Oct 06, 2025 | 12:40 PM

చాలా మందికి ఎలుకలంటే పట్టరానంత భయం. పైగి ఇవి ఒక్కసారి ఇంట్లోకి ప్రవేశించాయంటే ఓ పట్టాన బయటకు పోవు. దీంతో ఎలుకలను ఎలా వదిలించుకోవాలో తెలియక చాలా మంది తెగ ఇబ్బంది పడిపోతుంటారు. ఈ కింది సింపుల్ ట్రిక్స్‌తో మీ ఇంటి నుండి ఎలుకలను సులువుగా తరిమికొట్టవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఇంట్లో ఎలుకల నివారణకు పటికను ఉపయోగించవచ్చు. ఎలుకలకు పటిక వాసన, రుచి నచ్చదు. కాబట్టి మీ ఇంటి మూలల్లో, వంటగదిలో లేదా అల్మారాలో చిన్న పటిక ముద్దలను ఉంచండి. ఇంటి మూలల్లో పటిక పొడిని కూడా వేయవచ్చు.

ముందుగా ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకుని, అందులో అర కప్పు నీరు పోయాలి. దీనికి 1 టీస్పూన్ ఉప్పు, అర టీస్పూన్ బేకింగ్ సోడా వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఉప్పు, సోడా కరిగిపోయే వరకు కలుపుకోవాలి.

ఇప్పుడు 5 నల్ల మిరియాలు, 5-7 లవంగాలను మెత్తగా రుబ్బుకుని నీటిలో కలపాలి. 30 నిమిషాలు అలాగే ఉంచాలి. ఇప్పుడు 3-4 దీపాలు, దూది బంతులను తీసుకోవాలి. దూది బంతులను దీపం గిన్నెలోకి తీసుకుని, అందులో దూదిని ముంచాలి.

ఎలుకలు పుదీనా ఘాటైన వాసనను తట్టుకోలేవు. పుదీనా నూనెలో దూది బంతులను నానబెట్టి, వాటిని ఇంటి మూలల్లో, అల్మారాలలో, వంటగదిలో వాటిని ఉంచాలి. తద్వారా ఎలుకలు మీ ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధించవచ్చు.