OTT Movie: టన్నెల్‌లో ఉంటూ సైకో కిల్లర్ అరాచకాలు.. ఓటీటీలోకి వచ్చేసిన మెగా కోడలి క్రైమ్ థ్రిల్లర్ మూవీ
మెగా కోడలు లావణ్య త్రిపాఠి తల్లయ్యాక విడుదలైన మొదటి చిత్రమిది. కొద్ది రోజుల క్రితం తమిళ్ తో పాటు తెలుగులోనూ థియేటర్లలో విడుదలైన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందించింది. అయితే ఇప్పుడు సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది.

ఎప్పటిలాగే ఈ శుక్రవారం ( అక్టోబర్ 17) పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. తెలుగు తో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ సినిమాలు, సిరీస్ లు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేస్తున్నాయి. అయితే కాసేపటి క్రితమే ఒక సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా. కొద్ది రోజుల క్రితమే థియటర్లలో విడుదలైన ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. ఇందులో మెగా కోడలు లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించడం విశేషం. ఆమె తల్లయ్యాక రిలీజైన మొదటి సినిమా ఇదే. అలాగే తమిళ హీరో అధర్వ్ మరో కీలక పాత్రలో నటించాడు. రవీంద్ర మాధవ దర్శకత్వం వహించాడు. ఆకట్టుకునే కథా కథనాలు, గ్రిప్పింగ్ స్టోరీ లైన్ , ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు, అదిరే ట్విస్ట్ లతో సాగే ఈ సినిమా ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందించింది. ఐఎమ్ డీబీలోనూ ఈ మూవీకి 7.2 రేటింగ్ దక్కడం విశేషం. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఓ సైకో గ్యాంగ్ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. బ్యాంకు దొంగతనం చేసిన కొందరినీ పోలీసులు ఎన్ కౌంటర్ చేస్తారు. దీంతో ఆ ఎన్ కౌంటర్లో పాల్గొన్న పోలీసులతో పాటు యూనిఫామ్ వేసుకున్న ప్రతి ఒక్కరిని సైకో గ్యాంగ్ చంపేస్తుంటుంది.
మరోవైపు అఖిల్ (అధర్వ) కానిస్టేబుల్ ఉద్యోగం లో జాయిన్ అవతాడు. అయితే అతని జాయినింగ్ రోజే ఒక పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. సైకో గ్యాంగ్ ట్రాప్ లో చిక్కుకుంటారు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఓ కానిస్టేబుల్ సైకో గ్యాంగ్ ను ఎలా ఎదుర్కొన్నాడు? అసలు టన్నెల్ లో ఏముంది? చివరకు ఏమైంది? అన్నది తెలుసుకోవలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు టన్నెల్. తమిళంలో తనల్ గా రిలీజైంది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా ఇవాళ్టి (అక్టోబర్ 17) సాయంత్రం ఆరు గంటల నుంచే అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ ఈ మూవీ అందుబాటులో ఉంది.
తెలుగులోనూ స్ట్రీమింగ్..
#Thanal (Tamil)
Now streaming on Primevideo in Tamil, Telugu & Hindi 🍿!!#OTT_Trackers https://t.co/0WHXzqE2OO pic.twitter.com/n9xZ4gg6Oa
— OTT Trackers (@OTT_Trackers) October 17, 2025
Tamil Survival Film #Thanal Streaming Now On Amazon Prime Videos🔥 pic.twitter.com/eqObpdpSx9
— Saloon Kada Shanmugam (@saloon_kada) October 16, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








