AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : ఊహించని మలుపులు.. చెమటలు పట్టించే క్లైమాక్స్.. 2 గంటల హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

హారర్ సినిమాలు చూడడం అంటే మీకు ఇష్టమా.. ? అనుక్షణం సస్పెన్స్, ఊహించని మలుపులు, మిస్టరీ, భయంకరమైన సీన్లతో సాగే ఒక సినిమా ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది. దాదాపు 2 గంటల 19 నిమిషాలు ఉన్న ఈ సినిమా క్లైమాక్స్ మీకు చెమటలు పట్టిస్తుంది. ఇంతకీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ మూవీ గురించి మీకు తెలుసా.. ?అయితే ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందామా.

Cinema : ఊహించని మలుపులు.. చెమటలు పట్టించే క్లైమాక్స్.. 2 గంటల హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Cinema (3)
Rajitha Chanti
|

Updated on: Oct 17, 2025 | 4:52 PM

Share

సాధారణంగా హారర్ సినిమా పట్ల ప్రజలలో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇటీవల ఓటీటీల్లో ఇలాంటి జానర్ చిత్రాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఇప్పుడు మేకర్స్ సైతం ఈ జానర్ సినిమాలు తెరకెక్కించేందుకు ముందుకు వస్తున్నారు. ప్రతి సంవత్సరం అనేక యాక్షన్, థ్రిల్లర్, రొమాంటిక్ సినిమాలతోపాటు కనీసం ఒక హారర్ సినిమా విడుదలవుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హారర్ సినిమా క్లైమాక్స్ చూస్తే మీకు చెమటలు పట్టడం ఖాయం. ఊహించని మలుపులు, సస్పెన్స్, మిస్టరీ సన్నివేశాలతో సాగే ఈ సిరీస్.. ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది. హారర్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ చిత్రాన్ని మీరు ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు, కంటెంట్ ఏంటో తెలుసుకుందామా.. ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న హారర్ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ సినిమా పేరు సుమతి వలపు.

ఇవి కూడా చదవండి : Serial Actress: అబ్బబ్బో.. అదరగొట్టేస్తోన్న రుద్రాణి అత్త.. నెట్టింట గ్లామర్ గత్తరలేపుతున్న సీరియల్ విలన్..

ఈ హారర్ సినిమాకు విష్ణు శశి శంకర్ దర్శకత్వం వహించగా.. అభిలాష్ పిళ్లై కథను అందించారు. ఇందులో అర్జున్ అశోకన్, గోకుల్ సురేష్, సైజు కురుప్, బాలు వర్గీస్, మాళవిక మనోజ్ కీలకపాత్రలు పోషించారు. ఈ ఏడాది ఆగస్ట్ 1న విడుదలైన ఈ మూవీకి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఇప్పుడు సెప్టెంబర్ 26న ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా కథాంశం కేరళలోని తిరువనంతపురం జిల్లాలోని మాయలముడు గ్రామంలోని “సుమతి వలవు” అనే ప్రదేశానికి సంబంధించినది. 1950లలో, సుమతి అనే గర్భిణీ స్త్రీని ఆమె ప్రేమికుడు అక్కడ హత్య చేశాడని చెబుతారు. అప్పటి నుంచి ఆ ప్రదేశం దయ్యాలు ఉన్న ప్రాంతంగా మారిందని.. అక్కడకు చేరుకున్న కొందరు వ్యక్తుల జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనే సినిమా.

ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, కమల్ హాసన్‏తో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు విదేశాల్లో వ్యాపారాలు.. ఈ బ్యూటీ క్రేజ్ వేరప్పా..

ప్రస్తుతం ఈ మూవీ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. “సుమతి వలవు” 2025 లో అత్యధిక వసూళ్లు సాధించిన 9 వ మలయాళ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం IMDb లో 7.8/10 రేటింగ్ పొందింది. ఈ సినిమాలోని సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం, భయానక దృశ్యాలు, కామెడీ టైమింగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఇవి కూడా చదవండి : 43 ఏళ్ల వయసులో ఇంత స్లిమ్‏గా.. ఈ హీరోయిన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనట..