Tollywood: ఈ బూట్‌కట్ బాలరాజును గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హీరో.. భార్య కూడా ప్రముఖ నటినే
మొన్నటివరకు కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. అయితే తనలోనూ హీరో మెటీరియల్ ఉందని ఇటీవలే నిరూపించుకున్నాడు. అతను హీరోగా నటించిన మొదటి చిత్రం కొన్ని నెలల క్రితమే థియేటర్లలో విడుదలైంది. కమర్షియల్ గా విజయం సాధించకపోయినా సినిమాకు మంచి పేరొచ్చింది.

పై ఫొటోలో బూట్ కట్ ప్యాంట్ ధరించి పోజులిస్తోన్న కుర్రాడని గుర్తు పట్టారా? అతను ఇప్పుడు టాలీవుడ్ హీరో. అలాగనీ పెద్దగా సినిమాలేమీ చేయలేదు. మొన్నటివరకు బుల్లితెర నటుడిగా ఫేమస్. ఈ మధ్యనే హీరోగా పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే ఆకట్టుకున్నాడు. ఇప్పటివరకు తన కామెడీతో కడుపుబ్బా నవ్వించిన ఈ యాక్టర్ తన ఫస్ట్ సినిమాలో మాత్రం అందరితో కన్నీళ్లు పెట్టించాడు. కేవలం హీరోగానే కాదు తన మొదటి సినిమాకు తనే నిర్మాతగానూ వ్యవహరించాడు. ప్రమోషన్స్ కోసం కాళ్లరిగేలా తిరిగాడు. స్వయంగా తనే గోడలపై తన సినిమా పోస్టర్లు అంటించుకున్నాడు. సినిమా థియేటర్లకు వెళ్లేసి టికెట్లు అమ్మాడు. అన్నట్లు ఈ టాలీవుడ్ నటుడు ఓ మంచి మిమిక్రీ ఆర్టిస్ట్. ఈ రంగుల ప్రపంచంలోకి రాక ముందు ఎన్నో ప్రదర్శనలు కూడా ఇచ్చాడు. అన్నట్లు ఈ నటుడి భార్య కూడా ప్రముఖ నటినే. యాంకర్ గా కూడా పనిచేసింది. ఇద్దరూ చాలా కాలం పాటు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పెద్దల అనుమతితో పెళ్లిపీటలెక్కారు. ప్రస్తుతం బుల్లితెరతో పాటు వెండితెరపైనా అదృష్టం పరీక్షించుకుంటున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్ మరెవరో కాదు జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేష్. ఇది అతని చిన్ననాటి ఫొటో.
గతేడాది కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్) సినిమాతో హీరోగా మారాడు జబర్దస్త్ రాకింగ్ రాకేష్.గరుడవేగ అంజి తెరకెక్కించిన ఈ ఎమోషనల్ ఎంటర్ టైనర్ లో అనన్య కృష్ణన్ హీరోయిన్ గా నటించింది. కేసీఆర్ టైటిల్ పెట్టడం, భారీగా ప్రమోషన్లు నిర్వహించడంతో ఈ సినిమాకు మంచి ఓపెనింగ్సే వచ్చాయి. కలెక్షన్లు కూడా ఓ మోస్తరుగానే వచ్చాయి.
భార్య, కూతురితో జబర్దస్త్ రాకేష్..
View this post on Instagram
తనతో పాటు పలు జబర్దస్త్ స్కిట్స్ లో కలిసి నటించిన జోర్దార్ సుజాతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు రాకింగ్ రాకేష్. 2023 ఫిబ్రవరి 24న తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వీరి ప్రేమ బంధానికి ప్రతీకగా గతేడాది ఆగస్టులో ఈ దంపతులకు ఒక కూతురు జన్మించింది. తమ ఇంటి మహాలక్ష్మికి ఖ్యాతిక అని నామకరణం చేశారు.
కూతురు మొదటి పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా మొక్కలు నాటుతూ..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








