Kantara Chapter 1: రెండు వారాల్లో సంచలనం.. బాక్సాఫీస్ వద్ద కాంతార విధ్వంసం.. ఎన్ని కోట్లు వచ్చాయంటే..
భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న సినిమా కాంతార చాప్టర్ 1. రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి ఊహించని రెస్పాన్స్ వస్తుంది. గత రెండు వారాలుగా థియేటర్లలో దూసుకుపోతుంది. మరోవైపు చిన్న సినిమాలు విడుదలైనప్పటికీ కాంతార క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. తాజాగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది ఈ మూవీ. ఇంతకీ ఇప్పటివరకు ఎన్ని కోట్లు వచ్చాయో చూద్దామా.

కన్నడ స్టా్ర్ హీరో రిషబ్ శెట్టి హీరోగా నటించిన లేటేస్ట్ మూవీ కాంతార చాప్టర్ 1. దసరా కానుకగా అక్టోబర్ 2న విడుదలైన ఈ సినిమా ఇప్పుడు మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. భారతదేశంలో కేవలం 5 రోజుల్లోనే రూ. 500 కోట్ల మార్కును వసూలు చేసే దిశగా దూసుకుపోతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ఇప్పడు ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది. ఇండస్ట్రీ ట్రాకర్ సాక్నిల్క్ ప్రకారం, కాంతారా చాప్టర్ 1 బాక్స్ ఆఫీస్ కలెక్షన్ 15వ రోజు రూ. 6.84 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. గత రెండు వారాలుగా బాక్సాఫీస్ వద్ద కాంతార విధ్వంసం కొనసాగుతుంది. ఈ మూవీ రూ. 66 కోట్లతో ప్రారంభమైంది. మొదటి రోజే యాబై కోట్లకు పైగా వసూల్లు రాబట్టిన ఈ సినిమా.. తెలుగుతోపాటు కన్నడ, తమిళం, హిందీ, మలయాళం.. మొత్తం 5 భాషలలో రిలీజ్ అయ్యింది.
ఇవి కూడా చదవండి : Serial Actress: అబ్బబ్బో.. అదరగొట్టేస్తోన్న రుద్రాణి అత్త.. నెట్టింట గ్లామర్ గత్తరలేపుతున్న సీరియల్ విలన్..
కానీ ఈ సినిమా కన్నడ, హిందీ, తెలుగు భాషలలోనే బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. రజనీకాంత్ కూలీ, అహాన్ పాండే, అనీత్ పడ్డా సైయారా, మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ల ఎల్2: ఎంపురాన్, కళ్యాణి ప్రియదర్శన్, దుల్కర్ సల్మాన్ ల లోక చాప్టర్ 1: చంద్ర వంటి సినిమాలను ఇప్పుడు కాంతార వెనక్కు నెట్టింది. మొత్తం పదిహేను రోజుల్లో కాంతార రూ. 483 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కీలక పాత్రలు పోషించారు. 2022 బ్లాక్‌బస్టర్ కాంతారాకు ప్రీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా పురాణాలను లోతుగా అన్వేషిస్తుంది.
ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, కమల్ హాసన్‌తో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు విదేశాల్లో వ్యాపారాలు.. ఈ బ్యూటీ క్రేజ్ వేరప్పా..
కాంతార చాప్టర్ 1 ప్రతి సన్నివేశం.. బీజీఎమ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి అన్ని వర్గాల అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. థియేటర్లలో విడుదలై 15 రోజులు గడుస్తున్నప్పటికీ కాంతార చాప్టర్ 1 క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. రాబోయే రోజుల్లో ఈ మూవీ వసూళ్లు మరింత పెరగనున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి : 43 ఏళ్ల వయసులో ఇంత స్లిమ్‌గా.. ఈ హీరోయిన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనట..




