Actress : సినిమా ప్రారంభంలో అవమానాలు.. దెబ్బకు పేరు మార్చుకున్న హీరోయిన్.. ఇప్పుడు క్రేజ్ చూస్తే..
కెరీర్ ప్రారంభంలో ఎన్నో కష్టాలు పడింది. అనేక విమర్శలు ఎఁదుర్కోంది. కానీ ఇప్పుడు ఆమె ఇండస్ట్రీలో తోపు హీరోయిన్. తక్కువ సమయంలోనే మంచి ముద్రవేసింది. ప్రస్తుతం తల్లిగా ప్రమోషన్ పొందిన సంగతి తెలిసింద. ఇంతకీ ఆమె ఎవరో మీకు తెలుసా.. ఇప్పుడు తెలుగుతోపాటు హిందీ సినిమా ప్రపంచంలో టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు.

సినీరంగంలో నటిగా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఎంతో మంది అడుగుపెడుతుంటారు. కానీ కొందరు మాత్రమే సక్సెస్ అవుతుంటారు. కెరీర్ ప్రారంభంలో ఎన్నో కష్టాలు, అవమానాలు భరించి వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్న తారల గురించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ తొలినాళ్లల్లో అనేక అవమానాలు భరించింది. తక్కువ సమయంలోనే తనదైన ముద్ర వేసింది. సినిమా కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న కష్టాల కారణంగా తన పేరును పూర్తిగా మార్చుకున్న ఆమె.. ఆ తర్వాత ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే తారగా మారింది. ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ.
ఇవి కూడా చదవండి : 43 ఏళ్ల వయసులో ఇంత స్లిమ్‌గా.. ఈ హీరోయిన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనట..
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ అసలు పేరు ఏంటో మీకు తెలుసా.. ? ఆమె అసలైన పేరు అలియా అద్వానీ. బాలీవుడ్ కి వచ్చినప్పుడు, అలియా భట్ పాపులర్ కావడంతో తన పేరు మార్చుకోవాలని నిర్ణయించుకుంది. కియారా అనే పేరును ఎందుకు ఎంచుకున్నాడో ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కియారా మాట్లాడుతూ.. “అంజనా అంజనా చిత్రంలో ప్రియాంక చోప్రా పాత్ర కియారా నన్ను ఆకర్షితురాలిని చేసింది. మొదట నా కూతురికి నేను ఆ పేరు పెట్టాలనుకున్నాను. కానీ కెరీర్ ప్రారంభంలో నా పేరు మార్చుకోవడం ముఖ్యమని భావించాను. దీంతో నా పేరును కియారా అద్వానీగా మార్చుకున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, కమల్ హాసన్‌తో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు విదేశాల్లో వ్యాపారాలు.. ఈ బ్యూటీ క్రేజ్ వేరప్పా..
తెలుగులో భరత్ అనే నేను సినిమాతో కథానాయికగా పరిచయమైన కియారా.. ఆ తర్వాత వినయ విదేయ రామ సినిమాలో కనిపించింది. హిందీలో ఎక్కవగా సినిమాల్లో నటించిన కియారా.. ఇటీవల రామ్ చరణ్ సరసన గేమ్ ఛేంజర్ చిత్రంలో కనిపించింది. ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇటీవలే వీరికి పండంటి బిడ్డ జన్మించింది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Serial Actress: అబ్బబ్బో.. అదరగొట్టేస్తోన్న రుద్రాణి అత్త.. నెట్టింట గ్లామర్ గత్తరలేపుతున్న సీరియల్ విలన్..




