NTR డ్రాగన్ ఓటీటీ రిలీజ్ విషయంలో కీలక నిర్ణయం
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ ఓటీటీ విడుదల విషయంలో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఎనిమిది వారాల వరకు ఓటీటీలో స్ట్రీమ్ చేయకూడదని నిర్ణయించారు. ఇది ఓటీటీ-థియేటర్ల మధ్య గ్యాప్ చర్చలో కొత్త ట్రెండ్ సృష్టిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
రీసెంట్ టైమ్స్‌లో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు థియేట్రికల్ రన్‌ను గణనీయంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో థియేట్రికల్ రిలీజ్‌కు, ఓటీటీ విడుదలకు మధ్య కనీస గ్యాప్ ఉండాలన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ చర్చకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక అడుగు ముందుకు వేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం డ్రాగన్. ఇద్దరు పాన్ ఇండియా స్థాయిలో పేరు ప్రఖ్యాతులు పొందిన వారే కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డ్రాగన్ కలెక్షన్ల విషయంలో కొత్త రికార్డ్స్‌ను సృష్టిస్తుందని మేకర్స్ దృఢంగా నమ్ముతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విశాఖలో అతి పెద్ద ‘గూగుల్ ఏఐ హబ్’
ఒక్క రోజులోనే రూ.3,770 పెరిగిన బంగారం.. శుక్రవారం తులం బంగారం ఎంతంటే ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

