AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శేషాచలంలో అరుదైన ప్రాణులు

శేషాచలంలో అరుదైన ప్రాణులు

Phani CH
|

Updated on: Oct 17, 2025 | 8:09 PM

Share

శేషాచలం కొండలు ఆధ్యాత్మిక శోభకు, అపారమైన ప్రకృతి సంపదకు, జీవవైవిధ్యానికి నిలయం. అరుదైన వృక్షాలు, జంతుజాలానికి ప్రతీక. స్థానికంగా మనుగడ సాగిస్తున్న ఈ జీవ జాతుల ఉనికిని రానున్న తరాలకు తెలిపేందుకు పరిశోధనశాల వేదికగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఎర్రచందనం లాంటి అరుదైన వృక్షజాతులతో పాటు ఎన్నో జంతు జాతులకు ఆవాసంగా ఉన్నాయి తిరుమల కొండలు.

ఇక్కడి జీవజాలంపై శేషాచల జీవ వైవిధ్య పరిశోధన కేంద్రం వేదికగా అధ్యయనం సాగుతోంది. వైల్డ్ లైఫ్ మానిటరింగ్ సెల్ ఏర్పాటుచేసి జంతువులు, వృక్షాలు, ఇతర జీవజాలంపై పరిశోధన చేస్తోంది. శేషాచల జీవవైవిద్య పరిశోధనాశాలలో భాగంగా ఉన్న వైల్డ్ లైఫ్ మానిటరింగ్ సెల్‌ ఏర్పాటైంది. ఎలిఫెంట్ టాస్క్ ఫోర్స్, లెపర్డ్ మానిటరింగ్ సెల్ ద్వారా ఆయా వన్యప్రాణులపై పర్యవేక్షణ కొనసాగుతోంది. మరోవైపు ఈ పరిశోధనశాల అరుదైన జీవజాతుల ఆనవాళ్లను కూడా గుర్తిస్తోంది. బయోస్పియర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఎన్నో అరుదైన పాముల ఉనికిని వైల్డ్ మానిటరింగ్ సెల్ గుర్తించింది. వీటిలో డెడ్లీ పాయిజన్ స్నేక్స్, మైల్డ్ పాయిజన్ స్నేక్స్, నాన్ పాయిజన్ స్నేక్స్ ఉన్నాయని వెల్లడించింది. ఇటీవల తొలిసారిగా అరుదైన రియోపా డెక్కనెన్సిస్ అనే పామును గుర్తించింది. ఈ పాము పారదర్శక కనురెప్పలతో శరీరంపై చారలను కలిగివుండి తక్కువ మందంతో ఉందంటున్నారు పరిశోధకులు. సాధారణ పాము కంటే భిన్నంగా ఈ పాముకు శరీరంపై రెండు చోట్ల కాళ్లను తలపించే నిర్మాణం ఉంటుందని చెప్పారు. ఈ కొండల్లో కన్పించే అరుదైన జంతువులు, పక్షులు, కీటకాలు, సరీ సృపాల కళేబరాలను సేకరించి ఈ పరిశోధన శాలలో భద్రపరుస్తున్నారు పరిశోధకులు. తిరుమలోని పాప వినాశనం, మామండూరు, కరకంబాడి అటవీ ప్రాంతాల్లో అరుదైన ప్రాణుల కోసం పరిశోధన కొనసాగుతోంది. ఈ పరిశోధనశాలలో భద్రపర్చిన అరుదైన ప్రాణులపై డాక్యుమెంటరీ రూపొందించే ప్రయత్నంలో ఉంది జీవ వైవిధ్య పరిశోధన కేంద్రం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అర్చనలు చేయాల్సిన పూజారి అడ్డదారిలో వెళ్లాడు.. చివరికి..

దీపావళి సెలవులు పొడిగింపు! తెలంగాణలో అలా.. ఏపీలో ఇలా

పంట రక్షణకు.. పగటి వేషం నిజమైన ఎలుగుబంటి అనుకొని

సంస్కరణ బాటలో రైల్వే శాఖప్రయాణికులకు మంచి రోజులు

చెప్పులతో స్కూల్‌కు.. ప్రిన్సిపాల్‌ దాడిలో విద్యార్థిని