ఒక్క రోజులోనే రూ.3,770 పెరిగిన బంగారం.. శుక్రవారం తులం బంగారం ఎంతంటే ??
ధన్ తేరస్ పండుగకు ఒక్కరోజు ముందుగానే పుత్తడి కొనుగోలుదారులకు షాకిచ్చింది. ఇటీవల కాలంలో ఒక్కరోజులో బంగారం ధర ఇంతలా పెరగడం ఇదే మొదటిసారి. అమెరికా చైనా వాణిజ్య యుద్ధం, ఫెడ్ వడ్డీ రేట్లలో కోత ఉంటుందన్న అంచనాలు, బలహీన పడుతున్న డాలరు విలువ... బంగారానికి డిమాండ్‌ను అంతకంతకూ పెంచుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయంగానూ పసిడి జీవితకాల గరిష్టాలను నమోదు చేస్తోంది. అక్టోబర్ 17, శుక్రవారం నాటి ధరలు పరిశీలిస్తే.. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో 24 కేరట్ల బంగారం ధర తులం రూ.1,35,180 రూపాయలుగా ఉంది. 22 కేరట్ల బంగారం ధర తులం రూ.1,25,180 రూపాయలుగా ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.1,85,000 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,920 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,21,850 ఉంది. ముంబైలో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,770 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,21,700 ఉంది. చెన్నైలో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,090 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,22,900 ఉంది. బెంగళూరులో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,770 ఉండగా, 22 కేరట్ల10 గ్రాముల ధర రూ.1,21,700 వద్ద కొనసాగుతోంది. భారతదేశంలో ధన్ తేరస్, దీపావళి సందర్భంగా బంగారం అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వీకెండ్‌లో దీపావళి సందడి ఉండనే ఉంది. ఈ నేపథ్యంలో పండుగకు ముందే బంగారం, వెండి ధరలు భారీగా పెరిగిపోవడంతో కొనుగోలుదారులు ఆలోచనలో పడ్డారు. ఇంత పెరిగిన తర్వాత బంగారంలో ఇన్వెస్ట్ చేయడం సరైన వ్యూహమా అనే ఆలోచనలో ఉన్నారు
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అర్చనలు చేయాల్సిన పూజారి అడ్డదారిలో వెళ్లాడు.. చివరికి..
దీపావళి సెలవులు పొడిగింపు! తెలంగాణలో అలా.. ఏపీలో ఇలా
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

