సంస్కరణ బాటలో రైల్వే శాఖప్రయాణికులకు మంచి రోజులు
గరీబ్ కా రథ్ అని చెప్పుకునే ఇండియన్ రైల్వే.. సామాన్య ప్రయాణికుల కోసం మరిన్ని సదుపాయాలు తీసుకొచ్చింది. సాధారణ ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని టికెట్స్ బుకింగ్‌లో ఇప్పటి వరకు ఉన్న నిబంధనలు మార్చేసింది. రైల్వే టిక్కెట్లు కన్ఫర్మ్ అయిన తరువాత ప్రయాణ తేదీని మార్చుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అసాధ్యం.
ఆ టిక్కెట్లను రద్దు చేసుకొని, కొత్తది తీసుకోవడం మినహా మార్గం లేదు. టిక్కెటును క్యాన్సిల్ చేసుకున్నందుకు కొంత సొమ్మును నష్టపోవాలి. కొత్తగా రిజర్వేషన్ చేయించుకుంటే మళ్లీ రుసుము చెల్లించాలి. ఇది ప్రయాణికులకు నష్టం కలిగిస్తుండడంతో రైల్వే శాఖ కొత్త విధానాన్ని అమలు చేయనుంది. వచ్చే జనవరి నాటికి ఆన్‌లైన్‌లోనే ఉచితంగా ప్రయాణ తేదీని మార్చుకునే సౌకర్యాన్ని తీసుకురావాలని రైల్వేశాఖ యోచిస్తోంది. టికెట్ల జారీలో పారదర్శకత పెంచేందుకు రైల్వే శాఖ కీలక సంస్కరణలు చేపట్టింది. తత్కాల్ టికెట్ల దుర్వినియోగంతో పాటు ఏజెంట్ల ఆధిపత్యానికి చెక్ పెడుతూ పలు కొత్త రూల్స్ రూపొందించింది. తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవాలంటే ఆధార్ అథెంటికేషన్, కేవైసీ తప్పనిసరి. జులై 1 నుంచి ఈ విధానం అమలులోకి వచ్చింది, జులై 15 నుంచి ఆధార్ ఓటీపీని కూడా ప్రవేశపెట్టింది రైల్వేశాఖ. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లో నిజమైన ప్రయాణికులకు మాత్రమే టికెట్లు దక్కేలా చర్యలు చేపడుతోంది. తత్కాల్ బుకింగ్ ప్రారంభమైన తొలి అరగంట పాటు అధీకృత ఏజెంట్లు టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉండదు.కేవలం తత్కాల్ మాత్రమే కాకుండా, సాధారణ రిజర్వేషన్ ప్రక్రియలోనూ రైల్వేశాఖ మార్పులు చేసింది. ముందస్తు రిజర్వేషన్ గడువును 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గించింది. అంతేకాకుండా, అక్టోబర్ 1 నుంచి సాధారణ టికెట్ల బుకింగ్ ప్రారంభమైన మొదటి 15 నిమిషాల్లో కేవలం ఆధార్ వెరిఫైడ్ ఖాతాలకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు రైల్వే శాఖ అధికారులు. గతంలో రైలు బయలుదేరడానికి 4 గంటల ముందు చార్ట్ సిద్ధం చేసేవారు. ఇప్పుడు 8 గంటల ముందే దీనిని పూర్తి చేస్తున్నారు. దీనివల్ల టికెట్ ఖరారు కాని ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడానికి తగినంత సమయం లభిస్తుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చెప్పులతో స్కూల్‌కు.. ప్రిన్సిపాల్ దాడిలో విద్యార్థిని
చిన్నారి ప్రాణం తీసిన ఎయిర్ బ్యాగ్
48 ఏళ్ల నాటి కేసులో 71 ఏళ్ల వ్యక్తి అరెస్ట్
పార్టీ చేసుకున్న యువతీయువకులు.. అర్ధరాత్రి షాకింగ్ సీన్.. చివరకు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

