48 ఏళ్ల నాటి కేసులో 71 ఏళ్ల వ్యక్తి అరెస్ట్
దాదాపు 50 ఏళ్లు పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ఓ నిందితుడిని ముంబై పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. 48 ఏళ్ల క్రితం నాటి హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి, ఇప్పుడు 71 ఏళ్ల వయసులో పోలీసులకు చిక్కాడు. 1977లో ముంబైలోని కొలాబా ప్రాంతంలో కాలేకర్ అనే 23 ఏళ్ల యువకుడు తన ప్రియురాలిపై కత్తితో దాడి చేశాడు.
ఆ సమయంలో పోలీసులు అతడిని అరెస్ట్ చేయగా, కొద్ది రోజులకే బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఆ తర్వాత కోర్టు విచారణకు రాకుండా అదృశ్యమయ్యాడు. అప్పటి నుంచి అతడి కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు.దాదాపు 48 ఏళ్లుగా మూలనపడిన ఈ కేసును ఆరు నెలల క్రితం కొలాబా పోలీసులు మళ్లీ తెరిచారు. కోర్టు రికార్డులను పరిశీలిస్తున్న పోలీసులకు ఒక కీలక ఆధారం దొరికింది. రత్నగిరి జిల్లా దాపోలి పోలీస్ స్టేషన్‌లో 2015లో కాలేకర్‌పై రోడ్డుపై జరిగిన గొడవకు సంబంధించి ఒక కేసు నమోదైనట్లు గుర్తించారు. ఆ కేసులో ఉన్న చిరునామా ఆధారంగా పోలీసులు దాపోలిలోని అతడి ఇంటికి చేరుకున్నారు. 48 ఏళ్ల తర్వాత తమ ఇంటి తలుపు తట్టిన పోలీసులను చూసి కాలేకర్ షాకయ్యాడు. “అసలు ఆ పాత కేసు గురించే దాదాపు మరిచిపోయానని, పోలీసులను చూసి షాకయ్యాననీ కాలేకర్ అన్నాడు. నేరం జరిగినప్పుడు 23 ఏళ్ల యువకుడిగా ఉన్న కాలేకర్, ఇప్పుడు 71 ఏళ్ల వృద్ధుడిగా పూర్తిగా మారిపోవడంతో పాత ఫొటోలతో గుర్తుపట్టడం కష్టమైంది. అయితే, విచారణలో తానే ఆ నేరం చేసినట్లు అంగీకరించాడు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం అతడికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పార్టీ చేసుకున్న యువతీయువకులు.. అర్ధరాత్రి షాకింగ్ సీన్.. చివరకు
రైలు టికెట్ లేని వారి నుంచి ఒక్క రోజే రూ.కోటి వసూలు
చైనా పైసల కోసం గాడిదలు పెంచుతున్న పాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

