చైనా పైసల కోసం గాడిదలు పెంచుతున్న పాక్
తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ సరికొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలో పెషావర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో గాడిదల పెంపకానికి ఆధునిక ప్రయోగశాలలను ఏర్పాటు చేసి.. అక్కడ చైనా కోసం గాడిదలను పెంచుతోంది. ఇందుకోసం 2024లో జింగ్యింగ్ అనే చైనా కంపెనీతో ఓ ఒప్పందం కుదుర్చుకుంది.
పెషావర్‌లో 37 మిలియన్ డాలర్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా ఏటా 80 వేల గాడిదలను చైనాకు సరఫరా చేసేలా పాక్ సర్కారు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం..పాకిస్థాన్‌లోని కరాచీ పోర్ట్‌కు సమీపంలో ఓ భారీ కబేళాను నిర్మించాలని చైనా భావిస్తోంది. పాకిస్థాన్‌లో ప్రస్తుతం 52 లక్షల గాడిదలు ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో గాడిదలున్న మూడో దేశంగా పాకిస్థాన్ ఉంది. ఇంతకూ ఈ గాడిదలను చైనా ఏం చేస్తోంది.. అంటే.. చైనాలో గాడిద మాంసానికి, ఎముకలకు మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో పాక్ నుంచి నెలకు 10 వేల గాడిదలను ప్రాసెస్ చేసి, ఆ మాంసం, చర్మం చైనా తీసుకుంటుంది. గాడిద చర్మంతో చైనాలో సాంప్రదాయ ఔషధాలను తయారు చేస్తారు. గాడిద చర్మాన్ని ఉపయోగించి ఎజియావో అనే సాంప్రదాయ ఔషధాన్ని చైనీయులు తయారు చేస్తారు. ఈ ఔషధం రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి, అలసట తగ్గించడానికి, రక్తహీనత చికిత్సకు సాయపడుతుందని చైనీయులు నమ్ముతారు. ఈ ఎజియావో ఔషధానికి చైనాలో భారీ డిమాండ్ ఉంది . అయితే ఈ ఔషధ తయారీకి తగినన్ని గాడిదలు చైనాలో లేకపోవటంతో.. ఈ డీల్ కుదుర్చుకుంది. ఈ చైనా డీల్ కారణంగా పాక్‌లో గాడిదలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. పాక్‌లో 2000 సంవత్సరంలో ఒక్కో గాడిద ధర రూ.30 వేలుగా ఉండగా, ప్రస్తుతం అది రూ.2 లక్షలకు చేరింది. దీంతో గాడిదల పెంపకంపై పాక్ వాసులు దృష్టిపెడుతున్నారు. గాడిదల మేత కోసం పాకిస్తాన్‌లోని వివిధ ప్రాంతాలలో 40 ప్రత్యేక పొలాలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇక. ఈ డీల్ ముచ్చటను పాకిస్థాన్ ఆహార భద్రత మంత్రిత్వ శాఖ నిర్ధారించింది. అయితే స్థానికంగా మాత్రం గాడిద మాంసం అమ్మకాలపై నిషేధం ఉంటుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నీతా అంబానీ బ్యాగ్ ఖరీదెంతో తెలుసా ??
ఈ బుగ్గ గిల్లడాన్ని ఏమంటారో మరి
చూసే వాళ్ళం పిచ్చోళ్ళమా బిగ్ బాస్! సంజన – మాధురి తీరుపై జనం ఆగ్రహం
మాట తప్పిన మాధురి.. సార్ మాట కాదని వెస్ట్రన్ బట్టల్లో
ఎంకి పెళ్ళి సుబ్బి చావు అంటే ఇదే.. పాపం మాధురి దెబ్బకి నలిగిపోతున్న భరణి
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

