AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాక్‌ సైనికుల ప్యాంట్లు ఊడగొట్టాం.. ఇదిగో సాక్ష్యం.. తాలిబన్ల వీధి ప్రదర్శన

పాక్‌ సైనికుల ప్యాంట్లు ఊడగొట్టాం.. ఇదిగో సాక్ష్యం.. తాలిబన్ల వీధి ప్రదర్శన

Phani CH
|

Updated on: Oct 16, 2025 | 8:41 PM

Share

పాకిస్థాన్ - అఫ్గానిస్థాన్ సరిహద్దులు భగ్గుమంటున్న వేళ ఇండియాతో తాలిబన్ల స్నేహహస్తం..అటు, అమెరికాకు, ఇటు పాకిస్థాన్ కు షాక్‌ ఇచ్చినట్లయింది. ఇటీవల తాలిబన్‌ మంత్రి ఇండియాలో పర్యటించిన సమయంలోనే ఆఫ్ఘనిస్తాన్-పాకిస్థాన్ బార్డర్లు బద్దలైపోయాయి. రెండుదేశాల బలగాల మధ్య భారీ స్థాయిలో ఘర్షణలు చెలరేగాయి.

ముఖ్యంగా ఖైబర్-పఖ్తుంక్వా, బలూచిస్థాన్-డాన్ సరిహద్దుల్లో డ్యూరాండ్ లైన్‌కి ఇరువైపులా జరిగే భీకర కాల్పుల్లో పాకిస్తాన్‌ భారీ మూల్యం చెల్లించుకుంది. 58 మంది పాక్‌ సైనికుల్ని హతం చేసినట్టు, మరో 30 మంది గాయపడ్డట్టు అఫ్గానిస్తాన్ ప్రకటించింది. మరో ఏడుగురు పాక్ జవాన్లను బందీలుగా తీసుకున్నామంటూ ఫోటో రిలీజ్ చేశాయి ఆప్ఘన్ దళాలు. ఐసిస్‌ టెర్రరిస్టుల్ని బహిష్కరించాలని పాకిస్తాన్‌కు తాలిబన్లు అల్టిమేటమ్ జారీ చేశారు. ప్రస్తుతానికి అఫ్ఘాన్‌ సరిహద్దును మూసేసి ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటోంది పాకిస్థాన్.తమ దెబ్బకు పాక్‌ సైనికులు పరారయ్యారని తాలిబన్‌ సైన్యం నిరూపించింది. తాము స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, ఆహార పదార్థాలు, పాక్‌ సైనికుల దుస్తులు, ఇతర సామాగ్రిని అఫ్ఘాన్‌ సైనికులు నంగర్‌హార్ ప్రావిన్స్‌లో బహిరంగంగా ప్రదర్శించారు. పాక్‌ సైనికుల ప్యాంట్లను ప్రదర్శిస్తూ.. ఆ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కాగా, కాబూల్, కాందహార్‌పై పాక్‌ దాడులతో రగిలిపోతున్న అఫ్ఘాన్‌ ప్రజలు తాలిబన్లకు మద్దతుగా నిలిచారు. అవసరమైతే తాము కూడా ముజాహిదీన్‌గా మారిపోయి యుద్ధానికి సిద్ధమని కాందహార్‌ యువకులు చెబుతున్నారు. తమ భూమిని రక్షించిన భద్రతా బలగాలకు కృతజ్ఞతలని, తాము ఎల్లప్పుడూ వారి పక్కనే ఉంటామని స్థానికులు చెప్పారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భారత్‌లోనే 2030 కామన్వెల్త్ గేమ్స్… నవంబరు 26నే అధికారిక ప్రకటన

ఆలయ ప్రాంగణంలో వింత ఆకారం.. విద్యుత్‌ కాంతుల మధ్య ధగధగా మెరుస్తూ

ఆరు పదుల వయసులోనూ గుర్రంపై సవారీ.. అదుర్స్‌

కోతి చేతిలో నోట్ల కట్టలు.. చెట్టెక్కి చెలరేగిపోయిన వానరం

ప్రయాణీకులకు అలర్ట్.. రైళ్లలో అవి తీసుకెళ్తే రూ.1000 జరిమానా