కోతి చేతిలో నోట్ల కట్టలు.. చెట్టెక్కి చెలరేగిపోయిన వానరం
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. మంగళవారం ఉదయం ఒక కోతి 500 రూపాయల నోట్లు ఉన్న బ్యాగ్‌ను పట్టుకుని చెట్టు ఎక్కేసింది. బ్యాగ్‌లో ఉన్న నోట్ల కట్టలను విప్పి చెల్లా చెదురుగా చెట్టు మీది నుంచి కింద పడేసింది. ఈ సంఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ క్రమంలో అక్కడున్న స్థానికులంతా కోతి విసిరిన నోట్లను అందుకునేందుకు ోటీ పడటంతో ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది.
అయితే.. వారంతా ఆ నోట్లను బాధిత యువకుడికి తిరిగిచ్చారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని గంగానగర్ జోన్‌లోని సోరాన్ తహసీల్‌లోని ఆజాద్ సభగర్‌లో జరిగింది. ఒక యువకుడు తన బైక్‌ను అక్కడ పార్క్ చేసి, ఒక భూమిని రిజిస్టర్ చేయడానికి రెవెన్యూ ఆఫీసుకు వచ్చాడు. డబ్బును బైక్ ట్రంక్‌లో ఒక బ్యాగ్‌లో ఉంచాడు. అయితే..ఆ కోతి కూడా అక్కడికి సమీపంలోనే ఉంది. ఆ యువకుడు బైక్ నుంచి దూరం జరిగాక, ఆ కోతి బైక్ దగ్గరకు వచ్చింది. రాగానే, ఆ డబ్బాలో ఏదో తినే పదార్థం ఉందనుకుందో ఏమో గానీ.. టక్కున ఆ సంచీని బయటకు లాగింది. అది గమనించిన జనం.. ఆ బ్యాగ్‌ను తిరిగి తీసుకోవడానికి బైక్ దగ్గరకు రావటంతో.. భయపడిన కోతి బ్యాగ్‌తో సహా.. సమీపంలోని చెట్టు ఎక్కింది. దీంతో స్థానికులు.. పెద్దగా కేకలు వేస్తూ.. కింద నుండి కోతిపై రాళ్లు రువ్వారు. అయితే.. ఆ కోతి బ్యాగ్ కింద పడేయకపోగా.. అందులోని నగదు కట్టను తీసి.. చేతికొచ్చిన రీతిలో 500 నోట్లను కిందకు విసరటం మొదలుపెట్టింది. దీంతో.. జనం ఆ నోట్లను సేకరించి.. అక్కడే నిలబడిన యువకుడికి తిరిగి ఇచ్చారు. డబ్బులు అన్నీ దక్కడంతో ఆ యువకుడు ఊపిరి పీల్చుకున్నాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రయాణీకులకు అలర్ట్.. రైళ్లలో అవి తీసుకెళ్తే రూ.1000 జరిమానా
చితిపై ఉంచగానే మృతదేహం నుంచి ఓంకారం
డ్రగ్ టెస్ట్‌లో నటి హేమకు ‘నెగెటివ్
వృద్ధురాలికి వానరం.. కన్నీటి వీడ్కోలు
నిప్పుల కొలిమిలా ఏపీ...54 మండలాల్లో తీవ్ర వడగాలుల ముప్పు!
50 రోజులు జైల్లో 25 హోటల్లో.. 19 గంటలు బస్సులో..
పాకిస్థాన్‌లో పెట్రో మంటలు.. లీటరు ఎంతో తెలుసా?
కిరాణా వ్యాపారి ఖతర్నాక్ స్కెచ్..పేదల బంగారం స్వాహా
ఓర్నీ.. విమానంలో ఉన్నప్పుడు.. నీకిదేం పోయేకాలం రా

