ఇక.. రైలు టికెట్ ఇంటికే డెలివరీ
తపాలాశాఖ మరో ముఖ్యమైన సేవకు శ్రీకారం చుట్టింది. ఇకపై ఎంపిక చేసిన పోస్టాఫీసులలో రైల్వే రిజర్వేషన్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. రైల్వే స్టేషన్‌లు లేదా కౌంటర్లు లేని మారుమూల ప్రాంతాల్లోని ప్రజల కోసం, రైల్వే మంత్రిత్వ శాఖతో కలిసి రైల్వే రిజర్వేషన్ టిక్కెట్‌లను పోస్టాఫీసుల్లో బుక్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.
దీని ద్వారా అన్ని తరగతుల రైల్వే రిజర్వేషన్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. రైల్ హెడ్ లేదా రైల్వే కౌంటర్లు లేని ప్రాంతాలపై దృష్టి సారించిన భారతీయ రైల్వే.. ఈ సేవ ప్రారంభించింది. ప్రస్తుతం దేశం అంతటా 333 పోస్టాఫీసులలో రైల్వే టిక్కెట్ బుకింగ్ సేవ అందుబాటులో ఉంది. ఇందులో ఎక్కువ భాగం గ్రామీణ, పాక్షిక గ్రామీణ ప్రాంతాలలో ఉన్నాయి. తద్వారా రైల్వే ప్రయాణ సౌలభ్యాన్ని మెరుగుపరుస్తున్నాయి. ఇప్పుడు రైల్వే టికెటింగ్ సేవను జోడించడం ద్వారా తమ సేవలను మరింత విస్తరించింది. పోస్టాఫీసు ఇంటి వద్దకే రైల్వే టిక్కెట్లను డెలివరీ చేసే సేవను కూడా అందిస్తుంది. రైల్వే టిక్కెట్లను బుక్ చేసుకోవాలనుకునే ప్రయాణీకులు ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ కౌంటర్ ఉన్న పోస్టాఫీసుకు వెళ్లాలి. సాధారణంగా ఇవి రైల్వే స్టేషన్ లేదా కౌంటర్లు లేని ప్రాంతాలలో ఉంటాయి. కౌంటర్ వద్ద ఉన్న సిబ్బందికి మీ ప్రయాణ సమాచారాన్ని తెలియజేయాలి. అక్కడ ఇచ్చిన రిజర్వేషన్ ఫాం నింపి, టికెట్ డబ్బు కట్టాలి. అంతే మీ టికెట్ బుక్ అవుతుంది. అంతేకాదు.. మీరు కోరుకుంటే.. పోస్టుమ్యాన్ ఆ టికెట్ ను ఇంటికే తెచ్చి ఇస్తారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జపాన్‌ను వణికిస్తున్న మహమ్మారి.. ఆసియా అంతటా హై అలర్ట్
ఇక.. సులభంగా ఈపీఎఫ్ విత్ డ్రా.. ఎమర్జెన్సీలో 100 శాతం తీసుకోవచ్చు
ఆదరణకు నోచుకోని ఆదుర్రు స్తూపం
వాహనదారులకు బిగ్ అలర్ట్.. చలాన్లు 45 రోజుల్లోపు చెల్లించాలి
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

