నీతా అంబానీ బ్యాగ్ ఖరీదెంతో తెలుసా ??
ఆసియాలోనే అత్యంత ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ చాలా విలాసవంతమైన జీవితం గడుపుతారు. ఎంతో ఖరీదైన వస్తువులు వాడుతుంటారు. తాజాగా నీతా అంబానీ చేతిలోని ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ గురించే చర్చ జరుగుతోంది. బ్యాగ్ ధర వింటే మాత్రం కళ్లు తిరగాల్సిందే.
రూ. 17 కోట్ల రూపాయల విలువైన ఈ డిజైనర్ బ్యాగ్ ప్రపంచంలో మరో ఇద్దరి దగ్గర మాత్రమే ఉందట. ప్రముఖ డిజైనర్ మనీశ్ మల్హోత్రా ఇంట్లో జరిగిన దివాలీ పార్టీకి బీటౌన్ తారలు హాజరై సందడి చేశారు. ముకేశ్ అంబానీ కుటుంబం కూడా ఈ పార్టీలో మెరిసింది. నీతా అంబానీ , రాధిక మర్చంట్ దివాలీ పార్టీకి హాజరయ్యారు. ప్రత్యేక దుస్తుల్లో అందరినీ ఆకర్షించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. నీతా అంబానీ 61 ఏళ్ల వయసులో కూడా ఆరోగ్యంగా తనదైన ఫ్యాషన్ స్టైల్‌తో ఆకట్టుకున్నారు. అటు వ్యాపారవేత్తగా రాణిస్తూ, ఫిట్‌గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు.అంతేకాదు 40 ఏళ్లు దాటిన ప్రతి మహిళ వ్యాయామం యోగా లాంటివి చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటూ ఆమె సందేశమిస్తారు. అరుదైన 17 కోట్ల రూపాయల ధర పలికే హెర్మేస్ జ్యువెలరీ బ్యాగ్ , మనీష్ మల్హోత్రా చీరలో నీతా అంబానీ మరోసారి ఫ్యాషన్ ఐకాన్ అనిపించుకున్నారు. ఆమె బ్యాగ్ ప్రత్యేకించి వైట్ గోల్డ్‌తో తయారైంది. అందులో 3 వేల వజ్రాలు ధగధగ మెరుస్తూ అందరిని ఆకట్టుకున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ బుగ్గ గిల్లడాన్ని ఏమంటారో మరి
చూసే వాళ్ళం పిచ్చోళ్ళమా బిగ్ బాస్! సంజన – మాధురి తీరుపై జనం ఆగ్రహం
మాట తప్పిన మాధురి.. సార్ మాట కాదని వెస్ట్రన్ బట్టల్లో
ఎంకి పెళ్ళి సుబ్బి చావు అంటే ఇదే.. పాపం మాధురి దెబ్బకి నలిగిపోతున్న భరణి
మమిత – క్రికెటర్ గిల్ మధ్య ఇలా లింకు పెట్టారేంట్రా ??
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

