ఎంకి పెళ్ళి సుబ్బి చావు అంటే ఇదే.. పాపం మాధురి దెబ్బకి నలిగిపోతున్న భరణి
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు.. ఇప్పుడు మాధురి దివ్య మధ్య జరుగుతున్న వార్ కాస్తా.. భరణిపై తెలియని ఒత్తిడిని పెంచేస్తోంది. దీంతో భరణి చెప్పుకోలేక.. కక్కలేక.. ఎవరితో మాట్లాడాలో తెలియక... కాస్త సైలెంట్ అయిన పరిస్థితి హౌస్‌లో కనిపిస్తోంది. ఇక వన్ ఆఫ్ ది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన దివ్వెల మాధురి.. హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వగానే తన ఆటను మొదలెట్టింది.
తన మాటతో.. ఆ మాటలోని గడుసుతనంతో.. ఆటతో.. ఆ ఆటల్లోని దూకుడుతనంతో బిగ్ బాస్ హౌస్‌లో తన మార్క్ ఏంటో చూపిస్తోంది. ఈక్రమంలోనే మాధురి సీనియర్ కంటెస్టెంట్ అయిన భరణిని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఆయన్ను ఒంటరి వాడిని చేసి… గేమ్‌లో తనతోనే ముందుకు సాగాలని చూస్తున్నట్టు ఉంది. అయితే అది డైరెక్ట్‌గా కాదు ఇండైరెక్ట్‌గా..! అప్పటికే భరిణితో బాండ్ క్రియేట్ చేసుకున్న దివ్య అండ్ తనూజా తో మాధురి వచ్చీ రాగానే గేమ్ స్టార్ట్ చేసింది. ఓ పక్క తనూజను పాంపర్ చేస్తూ భరణికి గ్రూప్ నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తోంది. మరో పక్క భరణిని ఫుల్ గా.. బ్లైండ్‌గా సపోర్ట్ చేసే దివ్యతో గొడవకు దిగుతోంది. కట్ చేస్తే దివ్య భరణితో తన ఆవేదన చెప్పుకుంటోంది. ఇలా దివ్వెల మాధురి స్ట్రాటజికల్‌గా ఆడుతూ.. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన భరణిని ఒంటరిని చేసి తన వైపుకు తిప్పుకునేలా గేమ్ ఆడుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మమిత – క్రికెటర్ గిల్ మధ్య ఇలా లింకు పెట్టారేంట్రా ??
వీళ్లవి నోళ్లు కాదు మైకు సెట్లు.. రీతూ – ఆయేషా గొడవతో.. అందరికీ తలనొప్పి
Mithra Mandali: చాలా కష్టపడి నవ్వాలి! హిట్టా..? ఫట్టా..?
గబ్బిలాలకు పూజలు చేసే గ్రామం.. ఎందుకో తెలుసా ??
200 ఏళ్ల నాటి అరుదైన శంఖం... ఏడాదికి ఒక్కసారే...
ప్రియుడి భార్య ఎంట్రీ..10వ అంతస్తు లో వేలాడిన ప్రియురాలు
ప్రపంచంలోనే 'లాంగెస్ట్' ఫ్లైట్ చూసారా..
నెలకు రూ. 8 వేలు జీతం.. కానీ రూ.13 కోట్ల జీఎస్టీ నోటీసు అందుకుంది
ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చారు.. కళ్లలో స్ప్రే కొట్టి..
యూట్యూబ్ చూసి ఆపరేషన్.. చివరికి..

