AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇజ్రాయెల్‌ ‘ఐరన్‌ డోమ్‌'తరహాలో చైనా డోమ్‌..

ఇజ్రాయెల్‌ ‘ఐరన్‌ డోమ్‌’తరహాలో చైనా డోమ్‌..

Phani CH
|

Updated on: Oct 17, 2025 | 8:30 PM

Share

ఇరాన్, హిజ్బుల్లా క్షిపణులను అడ్డుకున్న ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అమెరికా గోల్డెన్ డోమ్ ఆలోచనలో ఉండగానే, చైనా భూమినంతటినీ కవర్ చేసే అధునాతన డోమ్ ప్రోటోటైప్‌ను పరీక్షించింది. భారత్‌కు ఆకాశ్ రక్షణ వ్యవస్థ ఉండగా, 2035 నాటికి సుదర్శన చక్రను తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అటు ఇరాన్‌, ఇటు హిజ్బోల్లా ప్రయోగించిన క్షిపణులను, రాకెట్లను గాల్లోనే తుత్తునియలు చేసిన ఇజ్రాయెల్‌ ‘ఐరన్‌డోమ్‌’ యావత్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ భద్రతకు ఇజ్రాయెల్‌ తరహా డోమ్‌ రక్షణ వ్యవస్థ ఎంతో అవసరమన్న విషయం ఈ పరిణామంతో అందరికీ తెలిసొచ్చింది. బాలిస్టిక్‌, క్రూయిజ్‌ క్షిపణుల దాడుల నుంచి అమెరికాను రక్షించేందుకు 175 బిలియన్‌ డాలర్లతో తాము కూడా గోల్డెన్‌ డోమ్‌ వ్యవస్థను అభివృద్ధి చేయబోతున్నట్టు అధ్యక్షుడు ట్రంప్‌ ఇటీవల ప్రకటించారు. డోమ్‌ ఏర్పాటు విషయంలో అమెరికా ఆలోచనా దశలో ఉండగానే.. చైనా మాత్రం అధునాతన డోమ్‌ ప్రొటోటైప్‌ను సిద్ధం చేసింది. దాన్ని విజయవంతంగా పరీక్షించింది కూడా. అంతేకాదు, అమెరికా గోల్డెన్‌ డోమ్‌ రక్షణ పరిధి ఆ దేశానికే పరిమితమవుతుండగా, చైనా తీసుకురానున్న ఈ డోమ్‌ ఏకంగా భూమినంతటినీ కవర్‌ చేయనుంది. భూతలం, గగనతలం, సముద్రతలం ఇలా ప్రపంచంలో ఏ చోటు నుంచైనా, ఏ దేశమైనా ప్రయోగించే క్షిపణులు, రాకెట్లు, యుద్ధ విమానాలను క్షణాల వ్యవధిలో పసిగట్టి కంట్రోల్‌ రూమ్‌కు సమాచారాన్ని చేరవేసే అత్యాధునిక డోమ్‌ సిస్టమ్‌ ప్రోటోటైప్‌ను చైనా పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇజ్రాయెల్‌కు ఐరన్‌ డోమ్‌, చైనాకు మిస్సైల్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ డోమ్‌, అమెరికాకు గోల్డెన్‌ డోమ్‌ ఉన్నట్టే భారత్‌కు ప్రస్తుతం ‘ఆకాశ్‌ క్షిపణి రక్షణ వ్యవస్థ’ అందుబాటులో ఉంది. 30 కిలోమీటర్ల దూరం, 18 వేల మీటర్ల ఎత్తులో ప్రమాదకరంగా వచ్చే క్షిపణులను, యుద్ధ విమానాలను, రాకెట్లను ఇది ఛేదించగలదు. 2035 నాటికి దేశానికి భద్రతా కవచంగా అత్యాధునిక రక్షణ వ్యవస్థ ‘సుదర్శన చక్ర’ను తీసుకురావడానికి సైన్యం ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విశాఖలో అతి పెద్ద ‘గూగుల్ ఏఐ హబ్’

ఒక్క రోజులోనే రూ.3,770 పెరిగిన బంగారం.. శుక్రవారం తులం బంగారం ఎంతంటే ??

శేషాచలంలో అరుదైన ప్రాణులు

అర్చనలు చేయాల్సిన పూజారి అడ్డదారిలో వెళ్లాడు.. చివరికి..

దీపావళి సెలవులు పొడిగింపు! తెలంగాణలో అలా.. ఏపీలో ఇలా