AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దీపావళి సెలవులు పొడిగింపు! తెలంగాణలో అలా.. ఏపీలో ఇలా

దీపావళి సెలవులు పొడిగింపు! తెలంగాణలో అలా.. ఏపీలో ఇలా

Phani CH
|

Updated on: Oct 17, 2025 | 7:53 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో దీపావళికి ఒకే రోజు అధికారిక సెలవు ఉండగా... ఈసారి అది ఆదివారం కలిసింది. దాంతో రెండు రోజులు సెలవులు వస్తాయి. శనివారం ధన త్రయోదశి కావటంతో చాలా విద్యాసంస్థలు సెలవులు ప్రకటించాయి. అంతేగాక..శనివారం తెలంగాణలో బిసి సంఘాలు తమ రిజర్వేషన్ల హక్కుల కోసం పోరాటం ఉద్ధృతం చేయడానికి బంద్‌కి పిలుపునిచ్చాయి.

వీటిని పరిగణలోకి తీసుకుంటే, తెలంగాణ విద్యాసంస్థలు, ఉద్యోగులకు వరుసగా మూడు రోజుల సెలవులు వచ్చినట్లే. ఇదిగాక.. తెలంగాణలో అక్టోబర్ 21న అదనపు సెలవు ఉండవచ్చని సమాచారం వస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. దీనిని కూడా ప్రభుత్వం సెలవుగా ప్రకటిస్తే మొత్తం నాలుగు రోజులు ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద, దీపావళి సీజన్‌ విద్యార్థులకు అదనపు ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ఇక.. ఏపీలో సోమవారం దీపావళి సెలవు ఉండగా, ఆదివారం ఎలాగూ సెలవే. అయితే.. రెండు జిల్లాల వారికి మాత్రం అదనంగా మరో రెండు సెలవులు వచ్చాయి. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కారణంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా విద్యాధికారులు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూల్ అర్బన్, రూరల్, ఓర్వకల్లు, కల్లూరు మండలాల పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు రెండు రోజుల పాటు మూసివేయనున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పంట రక్షణకు.. పగటి వేషం నిజమైన ఎలుగుబంటి అనుకొని

సంస్కరణ బాటలో రైల్వే శాఖప్రయాణికులకు మంచి రోజులు

చెప్పులతో స్కూల్‌కు.. ప్రిన్సిపాల్‌ దాడిలో విద్యార్థిని

చిన్నారి ప్రాణం తీసిన ఎయిర్ బ్యాగ్

48 ఏళ్ల నాటి కేసులో 71 ఏళ్ల వ్యక్తి అరెస్ట్‌