రైలు టికెట్ లేని వారి నుంచి ఒక్క రోజే రూ.కోటి వసూలు
టికెట్ లేని ప్రయాణికుల నుంచి జరిమానాగా రైల్వే శాఖ.. సోమవారం ఒక్కరోజే కోటి రూపాయలకు పైగా వసూలు చేసింది. దీపావళి, ఛట్ పండుగల సీజన్ తో అన్ని రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని స్టేషన్లలో అధికారులు తనిఖీలు తీవ్రం చేశారు. సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, గుంటూరు, నాందేడ్ డివిజన్లలో డ్రైవ్ చేపట్టారు.
దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ ఇతి పాండే ఆదేశాలతో సోమవారమంతా తనిఖీలు నిర్వహించారు. టికెట్ లేకుండా జర్నీ చేస్తున్న ప్రయాణికులను గుర్తించి జరిమానా వసూలు చేశారు. మొత్తం 1.08 కోట్ల రూపాయల ఆదాయం ఫైన్ రూపంలో లభించిందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే, టికెట్ లేకుండా ప్రయాణించిన వారిపై మొత్తం 16,105 కేసులు నమోదు చేశారు. సాధారణంగా జోన్ పరిధిలో రోజువారీ టికెట్ తనిఖీల్లో దాదాపు 9,500 కేసుల నమోదుతో సుమారు రూ.47 లక్షల ఆదాయం వస్తుంది. కానీ, దక్షిణ మధ్య రైల్వే చరిత్రలో ఒకే రోజు టికెట్ తనిఖీలతో ఆదాయం రూ. కోటి దాటడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా అధికారులను దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ శ్రీవాస్తవ అభినందించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చైనా పైసల కోసం గాడిదలు పెంచుతున్న పాక్
నీతా అంబానీ బ్యాగ్ ఖరీదెంతో తెలుసా ??
ఈ బుగ్గ గిల్లడాన్ని ఏమంటారో మరి
చూసే వాళ్ళం పిచ్చోళ్ళమా బిగ్ బాస్! సంజన – మాధురి తీరుపై జనం ఆగ్రహం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

