Pawan Kalyan: పవన్ కల్యాణ్ అంటే పిచ్చి.. కానీ ఇప్పుడు ఆయన సినిమాలో యాక్ట్ చేయను: కిరణ్ అబ్బవరం
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను ఎంతో అభిమానిస్తాడు. ఈ విషయాన్ని అతనే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఇక పవన్ కల్యాణ్ లేటెస్ట్ సినిమా ఓజీ ని ఫస్ట్ డే ఫస్ట్ షోనే చూశాడీ క్రేజీ హీరో.

ఈ దీపావళికి నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. మిత్రమండలి, తెలుసు కదా, డ్యూడ్, కె-ర్యాంప్ ఒకటి, రెండు రోజుల వ్యవధిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిలో కె-ర్యాంప్ సినిమా పై ఆడియెన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని తెలుస్తోంది. డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువగా ఉన్నాయని విమర్శలు వచ్చినా కిరణ్ అబ్బవరం సినిమా హాయిగా నవ్వుకునేలా ఉందని కాంప్లిమెంట్స్ వినిపిస్తున్నాయి. జైన్స్ నాని తెరకెక్కించిన ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్ గా నటించింది. నరేశ్ మరో కీలక పాత్రలో మెరిశాడు. గత దీపావళికి క సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన కిరణ్ అబ్బవరం ఈసారి కె-ర్యాంప్ తో మరో హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు హిట్ టాక్ రావడంతో మరింతగా ప్రమోట్ చేసే పనిలో ఉన్నాడు కిరణ్. వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు కిరణ్.
‘మీకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం కదా. ఆయన సినిమాల్లో నటించే అవకాశం వస్తే చేస్తారా’అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఇలా ఆన్సరిచ్చాడు కిరణ్ అబ్బవరం. ‘నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. ఈ విషయం ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. కానీ, ఆయన సినిమాల్లో ఇప్పుడు నేను చేయలేను. ఎందుకంటే, ఇప్పుడు నేను హీరోగా నా కెరీర్ బిల్డ్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్నాను. కాబట్టి, ఈ టైంలో మళ్లీ సైడ్ క్యారెక్టర్స్ అంటే చేయలేను. ఒకవేళ అవకాశం వస్తే కూడా.. ఈ క్యారెక్టర్ కిరణ్ అబ్బవరం అయితేనే చేయగలడు అనేలా ఉంటే చేస్తా. కానీ, పవన్ కల్యాణ్ సినిమాలో కనిపించాలని మాత్రం చేయను. ఇప్పుడు అంతా నా ఫోకస్ సినిమాలు, నా మార్కెట్ మీదనే ఉంది’ అని కిరణ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ హీరో కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. చాలా మంది కిరణ్ ఓపెన్ గా మాట్లాడడని ప్రశంసలు కురిపిస్తున్నారు.
కె-ర్యాంప్ సినిమాపై రమేశ్ బాల రివ్యూ..
#KRamp [3.25/5] : It delivers a full-course meal of entertainment! 🍿#KiranAbbavaram impresses with a career-best act, especially in the hospital sequence..
The interval twist keeps you hooked, while the farmhouse episode and climax blend humor and heart beautifully..…
— Ramesh Bala (@rameshlaus) October 18, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








