Tollywood: యాక్సెంచర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
ఈ హీరోయిన్ చదువులో చాలా చురుకు. పదో తరగతిలో 94 శాతం మార్కులు సాధించింది. ఇక ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లో ఏకంగా 85 శాతం మార్కులతో డిస్టింక్షన్ కొట్టింది. ఉన్నత చదువుల తర్వాత యాక్సెంచర్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా కూడా చేరింది.. కానీ నటనపై ఆసక్తితో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది

ఎన్‌సీసీ డ్రెస్‌లో ఉన్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఈ అమ్మాయి ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. కానీ పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు ఉంది. ఎందుకంటే ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి పరిచయమయ్యిందే పాన్ ఇండియా సినిమాలతో. ఇప్పటివరకు మొత్తం 5 సినిమాల్లో నటించింది. దాదాపు అన్నీ సినిమాలు సూపర్ హిట్లే. అయితే చాలా మంది లాగే ఈ అమ్మడు మొదట హీరోయిన్ అవ్వాలనుకోలేదు. డాక్టర్ కావాలని కలలు కంది. అందుకు తగ్గట్టుగానే ఉన్నత చదువులు అభ్యసించింది. అలాగే డ్యాన్స్, వాలీబాల్, త్రో బాల్, స్విమ్మింగ్ లో నైపుణ్యం సాధించింది. ఇక పదో తరగతిలో 94 శాతం మార్కులు సాధించింది. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లో ఏకంగా 85 శాతం మార్కులతో డిస్టింక్షన్ లో ఉత్తీర్ణత సాధించింది. ఆ తర్వాత బెంగళూరులోని దిగ్గజ ఐటీ కంపెనీ యాక్సెంచర్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ఉద్యోగానికి చేరింది. అయితే నటనపై ఆసక్తి ఉండడంతో మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ బ్యూటీ నటించిన మొదటి సినిమా రూ. 250 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇక రెండో సినిమాకు అయితే ఏకంగా రూ. 1250 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మూడో సినిమా పెద్దగా ఆడలేదు. కానీ నాలుగో సినిమా కూడా వంద కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టింది. ఈ దీపావళికి మరో సినిమాతో మన ముందుకు వచ్చింది. ఇది కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకెళుతోన్న ఈ క్యూటీ మరెవరో కాదు శ్రీనిధి శెట్టి. తెలుసుకదా సినిమా రిలీజ్ నేపథ్యంలో ఈ హీరోయిన్ చిన్ననాటి ఫొటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.
సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా తెలుసు కదా. నీరజ కోన తెరకెక్కించిన ఈ సినిమాలో రాశీఖన్నాతో పాటు శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. దీపావళి కానుకగా రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోంది. ఇందులో శ్రీనిధి శెట్టి నటనకు, గ్లామర్ కు మంచి మార్కులే పడుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే హిట్ 3 సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిందీ అందాల తార. నాని హీరోగా నటించిన ఈ సినిమా వంద కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు తెలుసు కదా సినిమాతో మరో హిట్ శ్రీనిధి ఖాతాలో పడింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు మరిన్ని సినిమా ఛాన్సులు వచ్చే అవకాశముంది.
శ్రీనిధి శెట్టి క్యూట్ ఫొటోస్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








