కుక్క కరిచిందా? రేబిస్ వ్యాక్సిన్ తీసుకున్న రేణూ దేశాయ్
ప్రముఖ నటి రేణూ దేశాయ్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంటోంది. 2023 లో టైగర్ నాగేశ్వర రావు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ మరో సినిమాలో నటించలేదు. అదే సమయంలో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీ బిజీగా ఉంటోంది. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, మూగజీవాల సమస్యల పై తన గళాన్ని వినిపిస్తోంది.
ఇందుకోసం ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ను కూడా ప్రారంభించింది. ఇక సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉండే రేణు పలు ఆసక్తికర విషయాలను అందులో పంచుకుంటుంది. అలా తాజాగా ఆమె ఒక ఆసక్తికర వీడియోను షేర్ చేసింది. రేబీస్ టీకా తీసుకున్న రేణూ దేశాయ్ ఆ వీడియోను రికార్డ్ చేసి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. సాధారణంగా టీకాలు తీసుకున్నప్పుడు ఫొటోలు లేదా వీడియోలు రికార్డ్ చేయనన్న రేణు దేశాయ్.. ఈసారి మాత్రం అవగాహన కల్పించే ఉద్దేశంతోనే ఇలా చేశానని ఆ వీడియోలో చెప్పుకొచ్చింది. మరోవైపు రేణూ దేశాయ్ కుమారుడు అకీరా నందన్ కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టవచ్చుననే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతుంది. పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమాలో అకీరా ఒక కీలక పాత్ర చేశాడని రూమర్స్ కూడా వినిపించాయి. కానీ అదేమీ జరగలేదు. ఈ నేపథ్యంలో అకీరాను సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నెత్తిన కిరీటం పెట్టి మరీ కోటింగ్.. మాధురి పవర్ తీసేసిన నాగార్జున
TOP 9 ET News: దిమ్మతిరిగే న్యూస్.. పవన్ లోకేష్ కాంబినేషన్‌లో సినిమా..?
నిన్న దివ్య.. నేడు రీతూ.. ఒక్కొక్కరినీ ఉతికి ఆరేస్తున్న మాధురి! హౌసంతా హడల్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

