AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 9: ఓటింగ్‌లో దూసుకుపోతోన్న కల్యాణ్, తనూజ.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు.. ఈ వారం ఎలిమినేట్ తనేనా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఏడో వారంలోకి అడుగు పెట్టింది. అయితే గత వారాల కంటే భిన్నంగా ఈ వారం ఏకంగా ఎనిమిది మంది నామినేషన్స్ లో నిలిచారు. మరి వీరిలో ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.

Bigg Boss Telugu 9: ఓటింగ్‌లో దూసుకుపోతోన్న కల్యాణ్, తనూజ.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు.. ఈ వారం ఎలిమినేట్ తనేనా?
Bigg Boss Telugu 9
Basha Shek
|

Updated on: Oct 21, 2025 | 10:15 PM

Share

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఏడో వారంలోకి అడుగు పెట్టింది. ఇక వైల్డ్ కార్డ్స్ కంటెస్టెంట్స్ వచ్చాక హౌస్ నిజంగానే రణరంగంగా మారిపోయింది. హౌస్ మేట్స్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే బిగ్ బాస్ 7 వారం నామినేషన్స్ హోరా హోరీగా సాగాయి. నిజం చెప్పాలంటే ఈ ప్రక్రియ ఒక చిన్నపాటి యుద్ధాన్నే తలపించింది. కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు పర్సనల్ అటాక్స్ చేసుకున్నారు. రీతూ చౌదరి వర్సెస్ అయేషా, తనూజ వర్సెస్ రమ్య మోక్ష  గొడవలు మరీ తారా స్థాయికి చేరుకున్నాయి. మొత్తానికి ఫైనల్ గా నామినేషన్స్ ప్రక్రియ ముగిసేసరికి మొత్తం 8 మంది కంటెస్టెంట్స్ లిస్ట్‌లో చేరారు. ఇక్కడ  రీతూ చౌదరి, కళ్యాణ్, తనూజ, రాము, దివ్య, సంజనా, రమ్య మోక్ష, శ్రీనివాస సాయి ఏడో వారం నామినేషన్స్ లో నిలిచిన వారిలో ఉన్నారు. వీరికి ఆన్ లైన్ ఓటింగ్ కూడా ప్రారంభమైంది.  తమ అభిమాన కంటస్టెంట్లను కాపాడుకోవడానికి ఫ్యాన్స్ ఓట్ల రూపంలో సపోర్టు ఇస్తున్నారు.

సోషల్ మీడియా లో నడుస్తోన్న ట్రెండ్స్ ప్రకారం ప్రస్తుతం ఓటింగ్‌లో కల్యాణ్ టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. ఇక బిగ్ బాస్ బుట్ట బొమ్మ తనుజా రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం టాప్ ప్లేస్ కోసం వీరిద్దరి మధ్య హోరా హోరీ ఫైట్ నడుస్తోంది. ఇక సంజన  మూడో స్థానంలో ఉండగా, రీతూ చౌదరి నాలుగో ప్లేస్ లో కొనసాగుతోంది. ఐదో స్థానంలో రమ్య మోక్ష, ఆరో ప్లేస్ లో దివ్య నికితా ఉండగా ,  ఏడు, ఎనిమిది స్థానాలో వరుసగా రాము రాథోడ్ , శ్రీనివాస సాయి ఉన్నారు. అంటే ప్రస్తుతం రాము, శ్రీనివాస సాయి డేంజర్ జోన్ లో ఉన్నారన్నమాట. అయితే ఓటింగ్ కు దాదాపు ఇంకా మూడు రోజుల సమయం ఉంది. కాబట్టి ఓటింగ్ లో ఏమైనా మార్పులు జరగొచ్చు. కానీ ఇలాగే ఓటింగ్ ట్రెండ్స్ కొనసాగితే మాత్రం రాము లేదా శ్రీనివాస సాయి ల్లో ఎవరైనా ఒకరు ఎలిమినేట్ అవ్వక తప్పదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
టీ20 వరల్డ్ కప్ వేళ పాక్ జట్టులో రచ్చ రచ్చ
టీ20 వరల్డ్ కప్ వేళ పాక్ జట్టులో రచ్చ రచ్చ
రైల్వే ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్స్!
రైల్వే ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్స్!
లిఫ్ట్‌లో అద్దాలు ఎందుకు ఉంటాయో తెలుసా? 99 శాతం మందికి తెలియదు..!
లిఫ్ట్‌లో అద్దాలు ఎందుకు ఉంటాయో తెలుసా? 99 శాతం మందికి తెలియదు..!
AP POLYCET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. సీటు పొందాలంటే ఇలా చేయండి
AP POLYCET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. సీటు పొందాలంటే ఇలా చేయండి
కెనడా ప్లేయర్ కాలు విరగ్గొట్టిన ఖతార్ ప్లేయర్ పై నిషేధం
కెనడా ప్లేయర్ కాలు విరగ్గొట్టిన ఖతార్ ప్లేయర్ పై నిషేధం
నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోవాల్సిందే.. హెల్తీ ‘బెల్లం రవ్వ లడ్డు
నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోవాల్సిందే.. హెల్తీ ‘బెల్లం రవ్వ లడ్డు
భారీగా పెరిగిన కూరగాయల ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
భారీగా పెరిగిన కూరగాయల ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
ముడుచుకుందంటే పులులు, సింహాలు కూడా ఏం చేయలేవ్..
ముడుచుకుందంటే పులులు, సింహాలు కూడా ఏం చేయలేవ్..
ఆ ఇద్దరి ఎఫెక్ట్.. ఇంగ్లాండ్ సిరీస్ నుంచి వైభవ్ ఔట్.. ఎందుకంటే?
ఆ ఇద్దరి ఎఫెక్ట్.. ఇంగ్లాండ్ సిరీస్ నుంచి వైభవ్ ఔట్.. ఎందుకంటే?
గంగమ్మ కస్టోడియల్ డెత్ కేసు ట్విస్ట్.. హైకోర్టు కీలక ఆదేశాలు
గంగమ్మ కస్టోడియల్ డెత్ కేసు ట్విస్ట్.. హైకోర్టు కీలక ఆదేశాలు