AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Renu Desai: రేణూ దేశాయ్ నిజంగానే సన్యాసం తీసుకుంటుందా? వీడియో రిలీజ్ చేసిన నటి

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రేణూ దేశాయ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. తనకు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఉందని, భవిష్యత్ లో సన్యాసం తీసుకుంటానని చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలోనూ, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ రేణూ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

Renu Desai: రేణూ దేశాయ్ నిజంగానే సన్యాసం తీసుకుంటుందా? వీడియో రిలీజ్ చేసిన నటి
Renu Desai
Basha Shek
|

Updated on: Oct 22, 2025 | 8:50 PM

Share

ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది నటి రేణూ దేశాయ్. సామాజిక సేవా కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉంటోంది. అయితే ఇటీవల ఆమె చేసిన కొన్ని కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. తనకు ఆధ్యాత్మిక భావం ఎక్కువని, సన్యాసం తీసుకుంటానని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా వైరలయ్యాయి. సోషల్ మీడియాలోనూ, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ రేణూ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. అయితే తాజాగా రేణూ దేశాయ్ తన సోషల్ మీడియా ఖాతాలో మరో వీడియోను పోస్ట్ చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సన్యాసం తీసుకుంటానంటూ తాను చేసిన కామెంట్స్‌పై మరోసారి స్పందించింది. ‘ ఇలాంటి వీడియో ఒకటి చేయాల్సి వస్తుందని నేను అనుకోలేదు. ఇటీవల దీపావళి ఇంటర్వ్యూలో ఒక యాంకర్‌ నెక్ట్స్‌ ఏంటి అని అడిగింది. దానికి నేను సరదాగా సన్యాసం తీసుకుంటా అని ఆన్సరిచ్చాను. అంతే కానీ ఇప్పటికిప్పుడు సన్యాసం తీసుకుంటానని ఎక్కడా చెప్పలేదు. దీనిని ఇప్పుడు పెద్ద సెన్సేషన్ చేశారు.

‘ నా ఫ్రెండ్స్‌, బంధువులు కాల్ చేసి ఈ విషయం గురించి అడుగుతున్నారు. అసలు రేణూ దేశాయ్ కు ఏమైంది? బాగానే ఉందా? అని అడుగుతున్నారు. నాకు ఇద్దరు పిల్లలున్నారు. ఆద్య టెన్త్ క్లాస్‌ చదువుతోంది. అకీరాను కూడా సెటిల్ చేయాల్సి ఉంది. వారి బాధ్యత ఇప్పుడు నాపై ఉంది. ఇప్పుడైతే నేను సన్యాసం తీసుకోను. నా వయసు 55 నుంచి 60 వచ్చినప్పుడు ఆలోచిస్తాను. నాకిప్పుడు దేవుడి కంటే నా పిల్లలే ముఖ్యం’ అని ఫుల్ క్లారిటీ ఇచ్చింది రేణూ దేశాయ్. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

రేణూ దేశాయ్ రిలీజ్ చేసిన వీడియో ఇదిగో..

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai)

కాగా 2023 లో రవితేజ నటించిన టైగర్ నాగేశ్వర రావు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది రేణూ దేశాయ్. అయితే దీని తర్వాత మరో సినిమాలో నటించలేదీ అందాల తార. అదే సమయంలో సామాజిక సేవా కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉంటోంది మహిళలు, చిన్నారులు, మూగజీవాల సమస్యల పట్ల తన గళాన్ని వినిపిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక స్వచ్ఛంద సేవా సంస్థ (NGO)ను కూడా ప్రారంభించింది.

దీపావళి వేడుకల్లో..

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
తక్కువ మసాలాలతో అదిరిపోయే మటన్ సుక్కా.. అదిరిపోయే రెసిపీ
తక్కువ మసాలాలతో అదిరిపోయే మటన్ సుక్కా.. అదిరిపోయే రెసిపీ
ప్రియురాలు మృతి.. విశాఖలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య..
ప్రియురాలు మృతి.. విశాఖలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య..
బ్యాంకు నుంచి వచ్చే మెసేజ్‌లను డిలీట్ చేస్తున్నారా? ఎంత డేంజరో..
బ్యాంకు నుంచి వచ్చే మెసేజ్‌లను డిలీట్ చేస్తున్నారా? ఎంత డేంజరో..
పాక్‌ వైమానిక దాడులపై ప్రతీకారం తీర్చుకుంటాం.. తాలిబన్ల వార్నింగ్
పాక్‌ వైమానిక దాడులపై ప్రతీకారం తీర్చుకుంటాం.. తాలిబన్ల వార్నింగ్
9వ తరగతి విద్యార్థులకు ఇస్రో యువికా 2026 ఆహ్వానం.. డైరెక్ట్ లింక్
9వ తరగతి విద్యార్థులకు ఇస్రో యువికా 2026 ఆహ్వానం.. డైరెక్ట్ లింక్
మ‌హావ‌తార్ నరసింహను బీట్ చేసే రేంజ్‌లో మరో యానిమేషన్ సినిమా
మ‌హావ‌తార్ నరసింహను బీట్ చేసే రేంజ్‌లో మరో యానిమేషన్ సినిమా
సకల శుభాలను తెచ్చే.. స్కంద షష్టి వ్రతం ఎలా చేయాలో తెలుసా..?
సకల శుభాలను తెచ్చే.. స్కంద షష్టి వ్రతం ఎలా చేయాలో తెలుసా..?
భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా? వెదర్ రిపోర్ట్
భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా? వెదర్ రిపోర్ట్
మీ డబ్బును ఒకే బ్యాంక్‌లో పెడుతున్నారా?
మీ డబ్బును ఒకే బ్యాంక్‌లో పెడుతున్నారా?
మీరు SBIలో రూ.50 లక్షల హోమ్‌ లోన్‌ తీసుకుంటే EMI ఎంత కట్టాలి?
మీరు SBIలో రూ.50 లక్షల హోమ్‌ లోన్‌ తీసుకుంటే EMI ఎంత కట్టాలి?