Tollywood: మేకప్ రూమ్‌లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. వెరైటీ ఎక్స్‌ప్రెషన్స్‌తో వైరల్.. ఎవరో గుర్తు పట్టారా?
ప్రస్తుతం దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఈ హీరోయిన్ లక్కీ గర్ల్ గా మారిపోయింది. ఇటీవల ఈ హీరోయిన్ నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అవుతున్నాయి. అదే సమయంలో ఈ స్టార్ హీరోయిన్ పై కొన్ని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. నెట్టింట ట్రోలింగ్ కూడా జరుగుతోంది.

పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఆమె దక్షిణాది క్రేజీ హీరోయిన్. తెలుగు, తమిళ్ తో పాటు హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తోంది. ఓ స్టార్ హీరో వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కానీ సక్సెస్ మాత్రం అంత త్వరగా చేతికి అందలేదు. కెరీర్ ప్రారంభంలోనే వరుస అపజయాలు ఎదురయ్యాయి. చేసిన సినిమాలన్నీ బోల్తా పడ్డాయి. ఐరన్ లెగ్ అన్న ముద్ర కూడా పడింది. కానీ ఎట్టకేలకు ఓ తెలుగు సినిమాతో సక్సెస ట్రాక్ ఎక్కింది. ఆ తర్వాత ఎదురన్నదేలేకుండా పోయింది. స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అందం, అభినయం పరంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మధ్యలో కొన్నేళ్లు గ్యాప్ ఇచ్చినా మళ్లీ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటోంది. ఇక సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుందీ అందాల తార. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులో షేర్ చేసుకుంటుంది. అలాగే తన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంటుంది. అలా తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఎందుకంటే ఈ ఫొటోల్లో ఆమె వైరెటీ ఎక్స్ ప్రెషన్స్ తో కనిపించింది. పై ఫొటోలు అవే. మరి ఆమె ఎవరో గుర్తు పట్టారా? తను మరెవరో కాదు శ్రుతి హాసన్.
ఇటీవల కూలీ సినిమాలో నటించిన శ్రుతి హాసన్ ఇన్ స్టా స్టోరీస్ లో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. ఇందులో మొత్తం మూడు ఫొటోస్ షేర్ చేసిన ఆమె వాటికి ఆసక్తికరమైన క్యాప్షన్స్ ఇచ్చింది. మొదట దోశ ఫొటోను షేర్ చేసి దోశ = లైఫ్ అన్నట్లుగా క్యాప్షన్ ఇచ్చింది. ఆ తర్వాత మేకప్ రూమ్ లో వర్కింగ్ మూడ్ అంటూ మరో డిఫరెంట్ ఫొటోను షేర్ చేసింది. అలాగే వెరైటీ ఎక్స్ ప్రెషన్స్ తో మరో ఫొటోను కూడ పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే తనను విమర్శిస్తోన్న నెటిజన్లకు, ట్రోలర్స్ కు కౌంటర్ గానే శ్రుతి హాసన్ ఈ ఫొటోలు షేర్ చేసినట్లు తెలుస్తోంది.
శ్రుతి హాసన్ లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








