చేసింది 8 సినిమాలు అందులో ఆరు ఫ్లాపులు.. అందంలో మాత్రం అజంతా శిల్పం
చాలా మంది హీరోయిన్ స్టార్ డమ్ కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్స్ తమ అందాలతో ప్రేక్షకులను కవ్విస్తున్నారు. అలాగే తమ నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అలాగే చాలా మంది హీరోయిన్స్ ఇతర భాషల నుంచి వచ్చి టాలీవుడ్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు.

సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్స్ హావ నడుస్తుంది. సినిమా సినిమాకు కొత్త భామలు ఎంట్రీ ఇస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నటున్నారు. కొంతమంది భామలు ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిపోతుంటే మరికొంతమంది స్టార్స్ అవ్వడం కోసం చాలా ప్రయత్నిస్తున్నారు. వరుసగా సినిమాలు చేస్తున్నా కూడా సక్సెస్ అందుకోలేకపోతున్నారు. తెలుగులో సినిమాలు చేస్తూనే.. మరోవైపు బాలీవుడ్ లోనూ.. తమిళ్ లోనూ అవకాశాలు అందుకుంటున్నారు. అన్ని భాషల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారిలో ఈ చిన్నది ఒకరు. తెలుగులో ఎనిమిది సినిమాలు చేసింది ఈ అమ్మడు. కానీ రెండు హిట్స్ మాత్రమే అందుకుంది.
ఇది కూడా చదవండి : అమ్మబాబోయ్..! నాగ చైతన్య హీరోయిన్ ఎంత మారిపోయింది.. సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
కెరీర్ బిగినింగ్ లో పద్దతిగా, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటూ.. డీగ్లామర్ రోల్ లో నటించింది.. ఇప్పుడు హాట్ లుక్స్ తో ప్రేక్షకులను కవ్విస్తుంది. ఇంతకూ ఆమె ఎవరో కనిపెట్టరా.? తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది ఈ అమ్మడు. ఆతర్వాత విభిన్న కథలను ఎంచుకుంటూ హీరోయిన్ గా చేస్తుంది. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ మాత్రం సాధించలేకపోయింది. ఆమె ఎవరో కాదు టాలీవుడ్ క్రేజీ బ్యూటీ రుహానీ శర్మ. తెలుగులో ఈ అమ్మడు చిలసౌ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది.
ఇది కూడా చదవండి : నాలుగు భాషల్లో రీమేక్ అయిన సినిమా.. కానీ తెలుగులో డిజాస్టర్.. అదేంటంటే
మొదటి సినిమాతోనే తెలుగు కుర్రాళ్ల హృదయాలను దోచేసింది హీరోయిన్ రుహానీ శర్మ. చిలసౌ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత సరైన క్రేజ్ మాత్రం సొంతం చేసుకోలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీ.. బాలీవుడ్ లోనూ ఈ చిన్నది తన అదృష్టం పరీక్షించుకుంది. చి.ల.సౌ సినిమా తర్వాత హిట్, డర్టీ హరి, నూటొక్క జిల్లాల అందగాడు, హర్, సైంధవ్, ఆపరేషన్ వాలెంటైన్, శ్రీరంగనీతులు సినిమాలు చేసింది. వీటిలో చి.ల.సౌ, హిట్ సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో అందాలతో పిచ్చెక్కిస్తోంది.
ఇది కూడా చదవండి : సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో.. చాలా బాధపడ్డానన్న నేచురల్ బ్యూటీ
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




