AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Divvala Madhuri: మాట నిలబెట్టుకున్న దివ్వల మాధురి.. క్యాన్సర్ బాధితురాలికి బిగ్ బాస్ రెమ్యునరేషన్ విరాళం.. వీడియో

వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా బిగ్‌ బాస్‌ తెలుగు 9 హౌస్ లోకి వెళ్లిన దివ్వెల మాధురి మూడో వారమే ఎలిమినేట్ అయి బయటకు వచ్చారు. ఆ తర్వాత వరుస దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి పలు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. అయితే తాజాగా దివ్వెల మాధురి దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి ఓ క్యాన్సర్ బాధితురాలి ఇంటికి వెళ్లింది.

Divvala Madhuri: మాట నిలబెట్టుకున్న దివ్వల మాధురి.. క్యాన్సర్ బాధితురాలికి బిగ్ బాస్ రెమ్యునరేషన్ విరాళం.. వీడియో
Divvala Madhuri
Basha Shek
|

Updated on: Dec 07, 2025 | 8:20 PM

Share

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది దివ్వెల మాధురి. అంతుకు ముందు దువ్వాడ శ్రీనివాస్ తో రిలేషన్ షిప్ తో ఆమె సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యింది. క్రేజ్ తోనే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టింది. వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె ఉన్నన్ని రోజులు తోటి కంటెస్టెంట్లకు చుక్కలు చూపించింది. అయితే మాటలు మరీ శ్రుతిమించడంతో ఆమెపై నెగెటివిటీ వచ్చింది. నాగార్జున కూడా మాధురిని హెచ్చరించాల్సి వచ్చింది. దీంతో మనసు మార్చుకున్న ఆమె తన ఆట, మాట తీరు మార్చుకుంది. కానీ అప్పటికే లేట్ అయిపోయింద. తక్కువ ఓట్లు పడడంతో మూడు వారాల్లోనే బయటకు వచ్చేసింది. బిగ్ బాస్ హౌస్ లో మాధురి ప్రవర్తనను పక్కన పెడితే.. బయటకు వచ్చాక ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. బిగ్‌ బాస్‌ వాళ్లు పారితోషికం ఎంత ఇస్తారో తెలియదు.. కానీ, వచ్చింది ఎంతైనా సేవ కార్యక్రమాలకే ఖర్చు పెడతామని మాధురి చెప్పిన మాటలు ఆమెపై గౌరవాన్ని పెంచాయి. ఇప్పుడు మాటను నిలబెట్టుకుంటోంది మాధురి. తన బిగ్ బాస్ రెమ్యునరేషన్ మొత్తాన్ని పేదలకు పంచుతోంది.

ఇవి కూడా చదవండి

మూడు రోజుల క్రితమే సేవా కార్యక్రమాలను ప్రారంభించింది మాధురి. దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి అత్యవసరం ఉన్న పేదలను గుర్తించి వారికి తన రెమ్యునరేషన్ ను సాయంగా అందజేస్తోంది. ఇప్పటికే బ్రెయిన్‌ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న లక్ష్మీ నారాయణ అనే వ్యక్తి ఇంటికెళ్లి మరీ రూ. 80 వేలుఆర్థిక సహాయాన్ని అందించారు మాధురి, దువ్వాడ. తాజాగా పేగు క్యాన్సర్‌తో బాధపడుతున్న మహిళకు వీరు అండగా నిలిచారు. నరసన్నపేట నియోజకవర్గం అల్లాడ గ్రామం లో హెచ్‌ కుమారి అనే ఓ మహిళ ప్రేగు క్యాన్సర్ తో పోరాడుతోంది. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాస్, మాధురి క్యాన్సర్ బాధితురాలి ఇంటికి వెళ్లారు. ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న ఆమెకు తాజాగా రూ. లక్షా పదివేలు సాయం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. మాధురి, శ్రీనివాస్ లపై ఎంత నెగెటివిటీ ఉన్నా సాయం విషయంలో మాత్రం వీరిని మెచ్చుకోవచ్చంటున్నారు నెటిజన్లు. వారి ఉదారతపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

క్యాన్సర్ బాధితురాలితో దువ్వాడ శ్రీనివాస్, మాధురి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.