AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu: తల్లైన బిగ్ బాస్ తెలుగు బ్యూటీ.. పాప పేరు భలే క్యాచీగా ఉందే.. ఫొటోస్ వైరల్

తెలంగాణ ప్రాంతానికి చెందిన ఈ ముద్దుగుమ్మ మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అలాగే బుల్లితెరపై కూడా సందడి చేసింది. కొన్ని నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఈ అందాల తార ఇప్పుడు తల్లిగా ప్రమోషన్ పొందింది.

Bigg Boss Telugu: తల్లైన బిగ్ బాస్ తెలుగు బ్యూటీ.. పాప పేరు భలే క్యాచీగా ఉందే.. ఫొటోస్ వైరల్
Bigg Boss Soniya
Basha Shek
|

Updated on: Dec 08, 2025 | 9:23 PM

Share

ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 చివరకొచ్చేసింది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఇప్పటికే 13 వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పుడు 14 వారంలోకి అడుగుపెట్టింది. అంటే మరో రెండు వారాల్లో ఈ రియాలిటీ షోకు ఎండ్ కార్డ్ పడనుందన్న మాట. ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సోనియా ఆకుల కూడా ఒకరు. గతేడాది ఎనిమిదో సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్న ఆమె తన ఆట, మాట తీరుతో బాగానే ఫేమస్ అయ్యింది. ముఖ్యంగా పెద్దోడు, చిన్నోడు అంటూ నిఖిల్, పృథ్వీతో సోనియా వ్యవహరించిన తీరు చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అయితే చివరి వరకు హౌస్ లో ఉంటుందనుకుంటే అనూహ్యంగా మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయిందీ అందాల తార. హౌస్ లో ఉన్నప్పుడే తన ప్రేమ విషయాన్ని బయటపెట్టిన సోనియా బయటకొచ్చిన వెంటనే ఎంటర్‌ప్రెన్యూర్ యష్‌తో ఎంగేజ్మెంట్ చేసుకుంది. గతేడాది సరిగ్గా ఇదే టైమ్ కు పెళ్లి కూడా చేసుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ శుభవార్త చెప్పింది. తమ ప్రేమ బంధానికి ప్రతీకగా ఓ పండంటి మహాలక్ష్మికి జన్మనిచ్చినట్లు వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది సోనియా.

‘08.12. 2025.. మా జీవితం పరిపూర్ణమైంది. మా ఇంటి మహాలక్ష్మి వచ్చేసింది’ అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు సోనియా, యష్ దంపతులు. ఇదే సందర్భంగా తమ కుమార్తెకు శిఖా వీరగోని అని నామకరణం చేసినట్లు పేర్కొన్నారు సోనియా దంపతులు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని చూసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సోనియా- యష్ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

సోనియా దంపతుల పోస్ట్..

కాగా రామ్ గోపాల్ వర్మ సినిమాలతో బాగా ఫేమస్ అయ్యింది సోనియా. ‘కరోనా వైరస్‌’, ‘ఆశా ఎన్‌కౌంటర్‌’ చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన ఆమె ‘జార్జ్‌ రెడ్డి’ మూవీలోనూ ఓ కీలక పాత్ర పోషించింది. ఇక బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక యష్‌‌ విషయానికి వస్తే..అతనికి గతంలోనే పెళ్లయింది. విరాట్ అని ఓ బాబు కూడా ఉన్నాడు. అయితే చాన్నాళ్ల క్రితమే భార్యకు విడాకులిచ్చేశాడు.

అజహరుద్దీన్ తో సోనియా దంపతులు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పటాన్‌చెరు సమీపంలో ఓ చెరువులో కనిపించిన భయానక దృశ్యం,వణికిపోతున్న
పటాన్‌చెరు సమీపంలో ఓ చెరువులో కనిపించిన భయానక దృశ్యం,వణికిపోతున్న
పెద్ది సినిమాలో ఆ ఎపిసోడ్ ఇష్టం.. సీక్రెట్ రివీల్ చేసిన చరణ్..
పెద్ది సినిమాలో ఆ ఎపిసోడ్ ఇష్టం.. సీక్రెట్ రివీల్ చేసిన చరణ్..
తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్‌!
తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్‌!
వార్నీ ఇంత చీపా.. 1984లో మారుతి 800 కారు ధర ఎంతో తెలిస్తే ..
వార్నీ ఇంత చీపా.. 1984లో మారుతి 800 కారు ధర ఎంతో తెలిస్తే ..
ఒత్తైన, మెరిసే జుట్టు మీ సొంతం కావాలా? పెరుగుతో ఇలా హెయిర్ ప్యాక్
ఒత్తైన, మెరిసే జుట్టు మీ సొంతం కావాలా? పెరుగుతో ఇలా హెయిర్ ప్యాక్
60 ఏళ్లు.. 700కు పైగా సినిమాలు.. ఈ నటి ఎవరంటే..
60 ఏళ్లు.. 700కు పైగా సినిమాలు.. ఈ నటి ఎవరంటే..
తడి పాదాలతో నిద్రపోవద్దంటారు ఎందుకు..? లక్ష్మీ కటాక్షం తగ్గి..
తడి పాదాలతో నిద్రపోవద్దంటారు ఎందుకు..? లక్ష్మీ కటాక్షం తగ్గి..
రవి బాబు తల్లి ఎలా చనిపోయారో తెలుసా? పాపం అతని కళ్ల ముందే..
రవి బాబు తల్లి ఎలా చనిపోయారో తెలుసా? పాపం అతని కళ్ల ముందే..
వాషింగ్ మెషీన్‌లో సర్ఫ్ వాడుతున్నారా..? అసలు ఏది వేస్తే మంచిదో..
వాషింగ్ మెషీన్‌లో సర్ఫ్ వాడుతున్నారా..? అసలు ఏది వేస్తే మంచిదో..
నీతి కథ: నక్క కుతంత్రానికి ఒంటె బలి.. దుష్టుల సావాసంతో కీడు
నీతి కథ: నక్క కుతంత్రానికి ఒంటె బలి.. దుష్టుల సావాసంతో కీడు