Allu Aravind : మన కల్చర్ ప్రపంచానికి పరిచయం చేయాలి.. ఇక్కడి కథలు ప్రపంచవేదికపై ఉండాలి.. అల్లు అరవింద్..
సినిమా రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తోందని అన్నారు నిర్మాత అల్లు అరవింద్. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో టాలీవుడ్, బాలీవుడ్ సినీప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్ తోపాటు నిర్మాత సురేష్ బాబు సైతం పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో నిర్మాత అల్లు అరవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక ప్రాంతాలతో ముడిపడి ఉన్న కథలతో తెరకెక్కించిన సినిమాలు ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నాయని అన్నారు. సినిమా రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు సురేష్ బాబు, దిల్ రాజు, జెనీలియాతోపాటు హిందీ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి : Serial Actress : షూటింగ్ కోసం వెళ్తే అసభ్యకరమైన ఫోటో చూపించిన పెద్ద హీరో.. సీరియల్ బ్యూటీ సంచలన కామెంట్స్..
అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ” గ్లోబల్ రేంజ్‌కు వెళ్లిన పుష్ప, కాంతార లాంటి సినిమాలు రూటెడ్ కథలతో తెరకెక్కినవి. మనం ట్రాన్స్‌ఫార్మార్స్, అవెంజర్స్ చేయాలనుకోవటం లేదు. మన మేకర్స్… ఇక్కడి కథలనే గొప్పగా ప్రపంచానికి చెబుతున్నారు. ఫోకస్డ్‌గా పని చేస్తే గొప్ప విజయాలు సాధించవచ్చు అని మన సినిమాలు నిరూపించాయి. ఇక్కడ ప్రభుత్వం చాలా సపోర్ట్‌గా ఉంది. చెన్నా రెడ్డి గారి దగ్గర నుంచి రేంవత్ రెడ్డి గారి వరకు ప్రతీ ఒక్కరు ఇండస్ట్రీతో ఫ్రెండ్లీగా ఉన్నారు. 25 ఏళ్ల క్రితం ఇక్కడ సినిమాలు చేయటం స్టార్ట్ చేసినప్పుడు ఎందుకు వచ్చామన్న బాధ ఉండేది. కానీ ఇప్పుడు అందరూ ఇక్కడి వస్తున్నారు.. ఈ స్థాయికి రావటం వెనుక ప్రభుత్వం సపోర్ట్ చాలా ఉంది..30 ఏళ్ల క్రితం కొరియా వాళ్ల కథను ప్రపంచానికి చెప్పటం స్టార్ట్ చేసింది. ఇప్పుడు మన పిల్లలు కూడా కొరియన్ సాంగ్స్ పాడుతున్నారు.. మన కల్చర్‌ను కూడా అలా ప్రపంచానికి పరిచయం చేయాలి” అని అన్నారు.
ఇవి కూడా చదవండి : Bigg Boss : నా బట్టలు నా ఇష్టం.. నాకు నచ్చినట్లు నేనుంటా.. బిగ్‌బాస్ బ్యూటీ సంచలన కామెంట్స్..
అలాగే నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ.. ” ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు సినిమా ఇండస్ట్రీ తమిళనాడులో ఉంది. ఇక్కడి ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా. ఇండస్ట్రీ ఇక్కడి రాలేదు. కానీ 25 ఏళ్ల క్రితం ఓ ముఖ్యమంత్రి ట్యాక్స్ విషయంలో తీసుకున్న నిర్ణయం ఇండస్ట్రీని ఇక్కడికి తీసుకువచ్చింది. ఆ తరువాత మరో ముఖ్యమంత్రి సినిమా కార్మికులకు ల్యాంగ్ ఇవ్వటం కూడా హెల్ప్ అయ్యింది. తెలుగు మేకర్స్ ఏ భాషల్లో సినిమా సక్సెస్ అయినా దాన్ని రీమేక్ చేసేవారు. హైదరాబాద్‌లో సినిమాకు ఫ్లెక్సిబుల్ ఈజీ ఎకోసిస్టమ్ ఉంది“ అని అన్నారు.
ఇవి కూడా చదవండి : Tollywood : ఒకప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. ఇప్పటికీ సినిమాల్లో బిజీ.. 52 ఏళ్ల వయసులో ఒంటరిగా..




