Actress Hema: డ్రగ్స్ కేసులో నటి హేమకు భారీ ఊరట.. కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు
తనపై డ్రగ్స్ ఆరోపణలు రావడంతో హేమ తీవ్ర మనస్థాపానికి గురైంది. సినిమాలకు కూడా విరామం ప్రకటించింది. అలాగే సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటోంది. కాగా తనపై ఉన్న ఈ డ్రగ్స్ కేసు కారణంగా తన తల్లి తీవ్ర ఆవేదనకు గురై కన్నుమూశారంటూ ఇటీవల వాపోయింది హేమ.

గత సంవత్సరం బెంగళూరు శివార్లలో జరిగిన రేవ్ పార్టీ కేసులో టాలీవుడ్ సీనియర్ నటి హేమ పేరు కూడా తెరపైకి వచ్చింది . ఇప్పుడు ఈ కేసులో నటికి పెద్ద ఉపశమనం లభించింది. నటిపై ఉన్న మాదకద్రవ్యాల వినియోగం కేసును కొట్టివేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ మంగళవారం (డిసెంబర్ 9) ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య పరీక్షల తర్వాత కేసును కొట్టివేయాలని కోరుతూ నటి హేమ హైకోర్టును ఆశ్రయించారు. హేమ పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు నిందితులపై NDPS కేసును కొనసాగించడానికి ఎటువంటి చట్టపరమైన ఆధారం లేదని నిర్దారించింది. దీంతో హేమపై ఉన్న కేసును కొట్టేసింది. కాగా హైకోర్టు కేసు కొట్టివేసిన తర్వాత నటి హేమ ఎమోషనల్ అయ్యింది. ‘ఈ కేసు కారణంగా నా తల్లి ఆవేదనతో కన్నుమూసిందంటూ అందరి ముందే కన్నీళ్లు పెట్టుకుంది.
కేసు నేపథ్యమిది..
2024లో, హెబ్బగోడిలోని జిఆర్ ఫామ్స్‌లో ఒక బర్త్ డే పార్టీని గ్రాండ్ గా నిర్వహించారు. హేమ కూడా ఈ పార్టీలో పాల్గొంది. కాగా ఈ పార్టీలో డ్రగ్స్ ఇతర మాదక ద్రవ్యాలు వినియోగించారని ఆరోపణలు వచ్చాయి. అలాగే శాంతిభద్రతలకు విఘాతం కలిగించారన్న అభియోగంతో నటి హేమతో సహా 88 మందిని అరెస్టు చేశారు. అయితే ఇప్పుడు ఈ కేసును కోర్డు కొట్టివేయడంతో నటి హేమకు భారీ ఊరట లభించినట్లయ్యింది.
View this post on Instagram
కాగా తెలుగులో వందలాది సినిమాల్లో సహాయక నటిగా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది హేమ. హీరోలు, హీరోయిన్లకు తల్లిగా, పిన్నిగా, అక్కగా, వదినగా ఇలా అన్ని పాత్రల్లోనూ నటించి మెప్పించిందీ అందాల తార. సినిమాలతో పాటు ప్రముఖ తెలుగు రియాలిటీ బిగ్ బాస్ షోలోనూ సందడి చేసిందీ సీనియర్ నటీమణి. పలు టీవీ షోల్లోనూ సందడి చేసింది. అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) లోనూ కీలక బాధ్యతలు నిర్వర్తించారను. అయితే ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోందీ అందాల తార.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








