Rajasekhar: హీరో రాజశేఖర్‌కు ప్రమాదం.. ఆస్పత్రిలో చికిత్స.. డాక్టర్లు ఏమంటున్నారంటే?
ఎన్నో ఏళ్లుగా హీరోగా అభిమానులను అలరించిన హీరో రాజశేఖర్ ఆ మధ్యన ‘ఎక్స్ ట్రార్డినరి మ్యాన్’ చిత్రంలో ఓ స్పెషల్ రోల్ తో మెప్పించాడు. ఆయన పాత్రకు మంచి పేరొచ్చినా సినిమా కమర్షియల్ హిట్ అవ్వలేదు. దీంతో చాలా గ్యాప్ తీసుకుని మళ్లీ కొత్త సినిమా స్టార్ట్ చేశాడు రాజశేఖర్.

టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజశేఖర్ కు ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. సినిమా షూటింగ్ లో ఆయన గాయపడ్డారని సమాచారం. కాలికి తీవ్ర గాయం కావడంతో వెంటనే ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లారని, అక్కడ వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారని తెలుస్తోంది. ప్రస్తుతం నటుడి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతం తమిళంలో విజయవంతమైన ‘లబ్బర్ పందు’ రీమేక్‌లో నటిస్తున్నారు రాజశేఖర్. ఈ చిత్రంలో విశ్వదేవ్ రాచకొండ హీరోగా నటిస్తుండగా, రాజశేఖర్ కుమార్తె శివాని హీరోయిన్‌గా కనిపించనుంది. అలాగే సీనియర్ హీరో, హీరోయిన్లు రాజశేఖర్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు . ఇప్పుడీ సినిమా షూటింగులో నే రాజశేఖర్ గాయపడ్డారని తెలుస్తోంది. ఆయన కాలి చీలమండకు గాయమైందని టాక్. పరీక్షించిన వైద్యులు చీలమండలో క్రాక్స్ ఉన్నట్లు గుర్తించి వెంటనే ఆపరేషన్ చేశారు. అనంతరం నాలుగు వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. రాజశేఖర్‌కు గాయం కావడంతో సినిమా షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. చిత్రీకరణను తిరిగి వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
లబ్బర్ పందు రీమేక్ విషయానికి వస్తే.. సుమారు 27 ఏళ్ల తర్వాత రమ్యకృష్ణ ఈ సినిమాలో రాజశేఖర్‌కు జోడీగా నటిస్తుండటం విశేషం. ఈ సినిమాతో పాటు రాజశేర్ మరో పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. నవంబర్ 25న కొత్త సినిమా చిత్రీకరణలో ఆయనకు గాయాలు అయ్యాయి. మేడ్చల్ సమీపంలో యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ చేస్తుండగా కాలికి గాయాలు అయ్యాయి. యూనిట్ సన్నిహిత వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం… రాజశేఖర్ కుడి కాలికి బలమైన గాయాలు అయ్యాయి. మడమ దగ్గర పెద్ద ఇంజ్యూరీ అయినట్టు తెలిసింది. గాయమైన వెంటనే హుటాహుటిన యూనిట్ సభ్యులు ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. వైద్యులు వెంటనే సర్జరీ చేశారు. సుమారు మూడు గంటల పాటు సర్జరీ జరిగింది. బలమైన గాయం కావడంతో బోన్ బయటకు వచ్చిందని, అందువల్ల సర్జరీకి మూడు గంటలు పట్టిందని సమాచారం. సర్జరీలో భాగంగా రాజశేఖర్ కాలిలో ప్లేట్స్ & వైర్ అమర్చారు. దీని వల్ల త్వరగా రికవరీ అవుతారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. నొప్పి భరిస్తూ రాజశేఖర్ సర్జరీ చేయించుకున్నారని, ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని యూనిట్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన రికవరీ అవుతున్నారు.
సర్జరీ తర్వాత మూడు నుంచి నాలుగు వారాల పాటు తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలని రాజశేఖర్ కు వైద్యులు తెలిపారు. ముఖ్యంగా గాయమైన కాలిని ఎట్టిపరిస్థితుల్లోనూ కడపకూడదని చెప్పారు. అందువల్ల కొన్ని రోజుల పాటు ఆయన చిత్రీకరణలకు దూరంగా ఉంటారు. జనవరి 2026 లో మళ్ళీ షూటింగ్ ప్రారంభించవచ్చు.
రాజశేఖర్ కు ఈ విధంగా గాయాలు కావడం మొదటిసారి కాదు. నవంబర్ 15, 1989లో ‘మగాడు’ షూటింగ్ చేస్తున్న సమయంలోనూ ఆయనకు గాయమైంది. అప్పుడు ఎడమ కాలికి గాయమైతే, ఇప్పుడు కుడి కాలికి గాయమైంది. ఇప్పుడు 35 ఏళ్ళ తర్వాత నవంబర్ నెలలో మళ్ళీ ఆయనకు గాయమైంది. గాయాలను సైతం లెక్క చేయకుండా యాక్షన్ సీన్లు చేస్తున్నారు. రాజశేఖర్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ ‘బైకర్’. అది కాకుండా మరో రెండు సినిమాలు చేస్తున్నారు. ఆ సినిమాల టైటిల్స్ ఖరారు చేయలేదు. రికవరీ తర్వాత ఆ రెండు సినిమాల చిత్రీకరణలు మొదలు అవుతాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




