Jani Master: అప్పుడు భర్త.. ఇప్పుడు భార్య.. డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా జానీ మాస్టర్ సతీమణి.. వీడియో
జానీ మాస్టర్ మళ్లీ సినిమాల్లో బిజీ అవుతున్నాడు. తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషల్లోనూ వరుసగా అతనికి సినిమా ఛాన్సులు వస్తున్నాయి. తాజాగా జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ అయేషా తెలుగు సినిమా, టీవీ డాన్సర్స్ అసోసియేషన్ (TFTDDA) అధ్యక్షురాలిగా గెలుపొందారు

జానీ మాస్టర్ అంటే కేవలం సినిమాలు మాత్రమే కాదు వివాదాలు కూడా ఉన్నాయి. ఆ మధ్య ఓ లేడీ కొరియోగ్రఫర్ (పేరు శ్రేష్టి వర్మ) జానీపై కేసు పెట్టింది తనను లైంగికంగా వేధించాడని.. దీనిపై కొన్ని రోజులు జైల్లో కూడా ఉన్నాడు ఈ కొరియోగ్రఫర్. శ్రేష్టి వర్మ జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. ఆమె 2017లో మొదటిసారి జానీ మాస్టర్‌ను కలిశారు. 2019లో ఆయన టీమ్‌లో చేరారు. ఈ సమయంలో జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించారని ఆమె ఆరోపించారు. తాను మైనర్‌గా (అప్పుడు 16 ఏళ్లు) ఉన్నప్పటి నుండే జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించారని ఆమె ఆరోపించారు. హైదరాబాద్, ముంబై, చెన్నై వంటి వివిధ నగరాల్లో అవుట్‌డోర్ షూటింగ్‌ల సమయంలో.. అలాగే నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ మాస్టర్ తనపై పలుమార్లు అత్యాచారం చేశారని ఆరోపించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే తన కెరీర్ నాశనం చేస్తానని, తనను పెళ్లి చేసుకోవాలని మతం మార్చుకోమని ఒత్తిడి చేశారని, శారీరకంగా దాడి చేశారని కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్రేష్టి వర్మ రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు Zero FIR నమోదు చేసి, తదుపరి విచారణ కోసం నార్సింగి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.
– బాధితురాలు వేధింపుల సమయంలో మైనర్ అని తెలపడంతో, జానీ మాస్టర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. IPC సెక్షన్లు అత్యాచారం (376), క్రిమినల్ బెదిరింపు (506), గాయపరచడం (323) వంటి సెక్షన్ల కింద కూడా కేసులు నమోదయ్యాయి. ఈ ఆరోపణల అనంతరం జానీ మాస్టర్ గోవాలో ఉండగా సైబరాబాద్ పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలుకు తరలించారు. దాదాపు 37 రోజుల జైలు జీవితం తర్వాత, 2024 అక్టోబర్‌లో తెలంగాణ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. కేసు పెట్టిన తర్వాత చాలా కాలం మౌనంగా ఉన్న శ్రేష్టి వర్మ.. ఈ మధ్యే కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చి, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి మళ్ళీ ఈ వివాదాన్ని వెలుగులోకి తెచ్చారు.. బిగ్ బాస్‌కు కూడా వెళ్లొచ్చారు ఈమే.. ఒకే వారంలో ఎలిమినేట్ అయ్యారు..
ఇక జానీ మాస్టర్ భార్య సుమలత, శ్రేష్టి వర్మ ప్రవర్తనపై షాకింగ్ కామెంట్స్ చేసి, ఆమె తన భర్తపై మనసు పారేసుకున్నారని అన్నారు. జానీ మాస్టర్ జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉండేవారు.. కానీ ఈ ఆరోపణల తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. తిరుచిత్రంబలం సినిమాకు గాను జానీ మాస్టర్‌కు ప్రకటించిన జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డును కేంద్ర ప్రభుత్వం అప్పుడు తాత్కాలికంగా నిలిపివేసింది. ఇంతకుముందు డాన్స్ మాస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాడు జానీ మాస్టర్.. ఇప్పుడు ఆయన భార్య తెలుగు సినిమా, టీవీ డాన్సర్స్ అసోసియేషన్ (TFTDDA) అధ్యక్షురాలిగా గెలుపొందారు.
భార్యకు శుభాకాంక్షలు చెబుతోన్న జానీ మాస్టర్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








