AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: బయట పడుకున్న వారిని బండరాయితో కొట్టి చంపే సైకో కిల్లర్.. ఓటీటీలో మతిపోగొట్టే రియల్ క్రైమ్ స్టోరీ

కోల్‌కతా, ముంబైతో పాటు దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో జరిగిన దారుణ హత్యల ఆధారంగా ఇది తెరకెక్కింది. ఇందులోని ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంఠ భరిత సన్నివేశాలు, ఊహించని ట్విస్టులు ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందిస్తాయనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

OTT Movie: బయట పడుకున్న వారిని బండరాయితో కొట్టి చంపే సైకో కిల్లర్.. ఓటీటీలో మతిపోగొట్టే రియల్ క్రైమ్ స్టోరీ
The Stoneman Murders Web Series
Basha Shek
|

Updated on: Dec 10, 2025 | 8:04 PM

Share

ఇటీవల రియల్ స్టోరీలు సిల్వర్ స్క్రీన్ పై సందడి చేస్తున్నాయి. అంటే నిజ జీవితంలో జరిగిన సంఘటనలు, కొందరు ప్రముఖ వ్యక్తుల జీవిత కథల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు వస్తున్నాయి. ఆడియెన్స్ నుంచి కూడా వీటికి మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా ఓటీటీలో రియల్ స్టోరీలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా ఒక రియల్ క్రైమ్ స్టోరీనే. కొన్నేళ్ల క్రితం దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో సీరియల్ మర్డర్స్ తో సంచలనం రేకెత్తించిన ఓ సైకో కిల్లర్ నేపథ్యంతో ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ తెరకెక్కింది. 1985-1989 మధ్య కాలంలో ముంబై, కోల్‌కతా నగరాల్లో ఒకే రకమైన సీరియల్ మర్డర్స్ జరుగుతాయి. ఒక సైకో కిల్లర్ రాత్రిపూట నిద్రిస్తున్న నిరాశ్రయులను టార్గెట్ చేసి రాళ్లతో కొట్టి అత్యంత కిరాతకంగా హత్యలు చేశాడు. . మరీ ముఖ్యంగా ఫుట్ పాత్ పై పడుకునే వారిని బండరాయితో కొట్టి హతమార్చాడు. సుమారు 13 మంది ఇలాగే ఆ సైకో కిల్లర్ చేతిలో దారుణ హత్యకు గురవుతారు. దీంతో పోలీసులు ఆ సైకో కిల్లర్ కు స్టోన్ మ్యాన్ అని పేరు పెడతారు.

ఇలా 13 మందిని బండరాయితో మోది చంపిన సైకో కిల్లర్ నేపథ్యం ఆధారంగానే ఈ క్రైమ్ సిరీస్ ను తెరకెక్కించారు. అసలు ఆ సైకో కిల్లర్ ఎవరు? ఎందుకీ హత్యలు చేశాడు? రాత్రి పడుకున్న వారినే ఎందుకు టార్గెట్ చేశాడు? పోలీసులు ఈ స్టోన్ మ్యాన్ ను పట్టుకున్నారా? చివరకు ఏమైంది? అనేది తెలుసుకోవాలంటే ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ చూడాల్సిందే.

గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సాగే ఈ సిరీస్ పేరు స్టోన్ మ్యాన్ మర్డర్స్. రజతభ దత్త, స్వస్తిక ముఖర్జీ , రూపంకర్ బాగ్చీ, అరిజిత్ దత్త, జిత్ దాస్ తదితరులు ఈ వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో మొత్తం 4 ఎపిసోడ్లు ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్‌ సుమారు 17-18 నిమిషాల నిడివి ఉంటుంది. ప్రస్తుతం ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు హోయిచోయ్ ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్  అందుబాటులో  లేదు కానీ ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ ఉన్నాయి. కాబట్టి ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ను సులభంగానే అర్థం చేసుకోవచ్చు. క్రైమ్ సినిమాలు, సిరీస్ లు చూడాలనుకునేవారికి ఈ స్టోన్ మ్యాన్ మర్డర్స్ వెబ్ సిరీస్ ఒక మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

OTT Movie: బయట పడుకుంటే బండరాయితో కొట్టి చంపై సైకో కిల్లర్
OTT Movie: బయట పడుకుంటే బండరాయితో కొట్టి చంపై సైకో కిల్లర్
ఎండు మిర్చి మీ డైట్‎లో ఉందంటే.. ఆ సమస్యల కథ క్లైమాక్స్‎కి..
ఎండు మిర్చి మీ డైట్‎లో ఉందంటే.. ఆ సమస్యల కథ క్లైమాక్స్‎కి..
కారం తింటే.. కళ్ళు, ముక్కు నుంచి నీరు రావడానికి కారణం ఇదే..
కారం తింటే.. కళ్ళు, ముక్కు నుంచి నీరు రావడానికి కారణం ఇదే..
ఏపీ ప్రజల కోసం మరో వందే భారత్ ట్రైన్.. షెడ్యూల్ రిలీజ్
ఏపీ ప్రజల కోసం మరో వందే భారత్ ట్రైన్.. షెడ్యూల్ రిలీజ్
"ఇండస్ట్రీలో అబ్బాయిలను కూడా కమిట్‌మెంట్ అడుగుతారు"
గుడ్లను ఫ్రిజ్‌లో పెడితే పాడవుతాయా.. పుకార్లు కాదు వాస్తవాలు..
గుడ్లను ఫ్రిజ్‌లో పెడితే పాడవుతాయా.. పుకార్లు కాదు వాస్తవాలు..
తెలంగాణలోనూ 'అఖండ 2' సినిమా టిక్కెట్‌ ధరలు భారీగా పెంపు..
తెలంగాణలోనూ 'అఖండ 2' సినిమా టిక్కెట్‌ ధరలు భారీగా పెంపు..
ఆన్‌లైన్‌లో ఆఫర్లు చూసి హెల్త్ ఇన్యూరెన్స్ తీసుకుంటున్నారా..?
ఆన్‌లైన్‌లో ఆఫర్లు చూసి హెల్త్ ఇన్యూరెన్స్ తీసుకుంటున్నారా..?
'రాహుల్ గాంధీకి ఎన్నికల వ్వవస్థపై అవగాహన లేదు'
'రాహుల్ గాంధీకి ఎన్నికల వ్వవస్థపై అవగాహన లేదు'
కల్యాణ్ మా కులపోడే.. కన్నడ అమ్మాయి బిగ్ బాస్ కప్పు కొట్టకూడదు..
కల్యాణ్ మా కులపోడే.. కన్నడ అమ్మాయి బిగ్ బాస్ కప్పు కొట్టకూడదు..