Bigg Boss : నా బట్టలు నా ఇష్టం.. నాకు నచ్చినట్లు నేనుంటా.. బిగ్‌బాస్ బ్యూటీ సంచలన కామెంట్స్..
బుల్లితెరపై చాలా కాలంగా సీరియల్స్, షోల ద్వారా పాపులర్ అయ్యింది. తక్కువ సమయంలోనే బిగ్‌బాస్ రియాల్టీ షోలోకు ఎంట్రీ ఇచ్చి తన ఆట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే టాప్ 5లో ఏకైక అమ్మాయిగా నిలిచింది. కానీ ఈ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎంతో నెగిటివిటీని మూట గట్టుగట్టుకుంది. ఇటీవల తన గురించి వచ్చిన ట్రోల్స్ పై ఓ షోలో స్ట్రాంగ్ కౌంటరిచ్చింది.

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. మొదటి సీరియల్ ద్వారా తెలుగులో ఎంతో పాపులర్ అయ్యింది. ఆ తర్వాత బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టి టాప్ 5లో నిలిచింది. కానీ ఈ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఊహించని విధంగా నెగిటివిటీని ఎదుర్కొంది. పలు షోలలో ఆమె వేసిన డ్రెస్సింగ్ పై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఆ సీరియల్ బ్యూటీ మరెవరో కాదు.. ప్రియాంక జైన్. తెలుగులో మౌనరాగం, జానకి కలగనలేదు వంటి హిట్ సీరియల్స్ చేసింది. ముఖ్యంగా మౌనరాగం సీరియల్ ఆమె కెరీర్ మలుపు తిప్పింది. సీరియల్స్ ద్వారా వచ్చిన క్రేజ్ తోనే బిగ్ బాస్ సీజన్ 7లోకి అడుగుపెట్టింది.
ఈ రియాల్టీ షోలో తన ఆట తీరుతో టాప్ 5 కంటెస్టెంట్ గా మారింది. ప్రస్తుతం కొత్త సీరియల్స్ చేయకపోయినా.. ఈవెంట్స్, టీవీ షోలలో పాల్గొంటుంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో ఏదోక పోస్ట్ చేస్తూ యాక్టివ్ గా ఉంటుంది. అలాగే తన తోటి నటుడు శివకుమార్ తో కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ప్రియాంక.. ఇప్పుడు అతడితో కలిసి నివసిస్తుంది. ప్రస్తుతం లివింగ్ లో ఉన్న వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. కొన్నాళ్ల క్రితం డ్యాన్స్ ఐకాన్ 2 షోలో పాల్గొన్న ప్రియాంక.. ఆమె వేసుకున్న డ్రెస్సింగ్ విషయంలో తీవ్ర నెగిటివిటీ ఎదుర్కొంది. ఆమె డ్రెస్సింగ్ స్టైల్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి.
అయితే ఓ టాక్ షోలో పాల్గొన్న ప్రియాంక తన డ్రెస్సింగ్ పై వచ్చిన విమర్శలకు ఘాటుగానే బదులిచ్చింది. “ట్రోల్స్ చూసి నేను షాకయ్యాను. ప్రపంచం మొత్తం నా మీదే మాట్లాడుతోందా ? అన్నట్లుగా కామెంట్స్ చేశారు. నేను నటించిన క్యారెక్టర్ ఉన్నంతసేపే ఆ లుక్ లో ఉంటాను. నేను నటిని. నా ఫ్రీడం నాకు ఉంది. నచ్చిన డ్రెస్ వేసుకోవడంలో తప్పేముందు. కొన్ని కామెంట్స్ భరించలేనంత దారుణంగా ఉన్నాయి. అవి చూసి చాలా అసహ్యం వేసింది” అంటూ చెప్పుకొచ్చింది. ట్రోలింగ్స్ సమయంలో తన ప్రియుడు శివకుమార్ ఎంతో సపోర్ట్ ఇచ్చారని తెలిపింది. నచ్చితే ఫాలో అవ్వండి.. లేదంటే అన్ ఫాలో అవ్వండి.. మనసుకు నొప్పి కలిగించేలా కామెంట్స్ చేయ్యొద్దు. నా బట్టలు నా ఇష్టం మీకేంటీ నొప్పి అంటూ ఎమోషనల్ అయ్యింది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : అబ్బ సాయిరాం.. ఒక్క మాటతో టాప్ 5కు.. ఓటింగ్లో దుమ్ములేపుతున్న డేంజర్ జోన్ కంటెస్టెంట్.. ఎలిమినేట్ అయ్యేది..








