Bigg Boss 9 Telugu : కళ్యాణ్‌కు ఝలక్.. ఛీటింగ్ చిట్టా బయటపెట్టిన భరణి.. హౌస్ లో రచ్చ..
ఫస్ట్ ఫైనలిస్ట్ టికెట్ కోసం ఎవరికి వారు గట్టిగానే పోటీపడుతున్నారు. శుక్రవారం ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరనేది తెలియనుంది. ఈ క్రమంలో తాజాగా విడుదలైన ప్రోమోలో భరణి కోపంతో ఊగిపోయాడు. ముఖ్యంగా కళ్యాణ్, డీమాన్ పవన్ ఛీటింగ్ బాగోతాన్ని బయటపెట్టాడు. దీంతో నాకు తెలుసు.. ఎవరిని బ్లేమ్ చేస్తున్నారంటూ మధ్యలోకి దూరిపోయాడు కళ్యాణ్.

నిన్నటి ఎపిసోడ్ లో భరణి వర్సెస్ రీతూ మధ్య రసవత్తరమైన పోరు నడించింది. వీరిద్దరి మధ్య జరిగిన టాస్కులో రీతూ గెలిచింది. అయితే చివరలో నాకు డౌట్ గా ఉందంటూ పుల్ల పెట్టింది తనూజ. దీంతో ఆమెకు వంత పాడాడు భరణి. ఈ టాస్కుకు సంచాలక్ అయిన సంజనపై బిగ్ బాస్ కు కంప్లైట్ చేశాడు భరణి. సంచాలక్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ నిప్పులు చెరిగారు భరణి. తాజాగా విడుదలైన ప్రోమోలో జంగ్ యార్డ్ లో ఉన్న ట్రయాంగిల్స్, స్క్వేర్స్, సర్కిల్స్ షేప్స్ గుర్తించి వాటిని ముందు పెడితే వాళ్లు గెలిచినట్లు.
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : అబ్బ సాయిరాం.. ఒక్క మాటతో టాప్ 5కు.. ఓటింగ్‌లో దుమ్ములేపుతున్న డేంజర్ జోన్ కంటెస్టెంట్.. ఎలిమినేట్ అయ్యేది..
అయితే రీతూ పెట్టిన వాటిలో ఒకటి ట్రయాంగిల్ కాదని వాయిస్ వినిపించాడు భరణి. రీతూ పెట్టిన ట్రయాంగిల్ కరెక్ట్ గా లేదని… రెక్టాంగిల్ అవుతుందని.. అయినా రీతూను విన్నర్ గా అనౌన్స్ చేశారని.. అది తప్పు అంటూ బిగ్ బాస్ కు కంప్లైంట్ చేశారు భరణి. నా పేరు ఎందుకు తీస్తున్నారు.. దానిని ట్రయాంగిల్ అనుకుండా ఏమంటారు అంటూ అరిచింది రీతూ. దీంతో నేను నీతో మాట్లాడడం లేదంటూ అంతే గట్టిగా సీరియస్ అయ్యాడు భరణి.
ఇవి కూడా చదవండి : Shhyamali De: నిద్రలేని రాత్రులు గడుపుతున్నా.. నా బాధను అర్థం చేసుకోండి.. రాజ్ నిడుమోరు మాజీ భార్య పోస్ట్..
“ఎక్కడెక్కడ ఛీటింగ్ జరిగింది.. ఎక్కడెక్కడ అన్యాయం జరిగిందీ.. ఎక్కడ షూ చూపిస్తే మనుషులను గుర్తుపట్టారో.. మొత్తం వీడియోలు బయటకు వచ్చాయి. ఇప్పటికీ నేను నోరు మూసుకుని కూర్చున్నాను” అంటూ గతంలో డీమాన్, కళ్యాణ్ చీటింగ్ గేమ్ ను బయటపెట్టాడు . దీంతో కళ్యాణ్ మధ్యలోకి ఎంట్రీ ఇచ్చాడు. కన్ఫెషన్ రూంలో ఏం చూపించారో నాకు తెలుసు.. వీడికి (డీమాన్)కు ఆ విషయం తెలియదు.. ఎవరిని బ్లేమ్ చేస్తున్నారు..నన్ను ఎందుకు బ్లేమ్ చేస్తున్నారంటూ ఫైర్ అయ్యాడు కళ్యాణ్. నీ పేరు తెచ్చానా.. నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావ్ అంటూ కళ్యాణ్ మీద మీదకు వెళ్లాడు భరణి. మొత్తానికి ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న భరణి… ఇప్పుడు విశ్వరూపం చూపించాడు.
ఇవి కూడా చదవండి : Actress : ఆ పని నేను చేయలేదు.. అందుకే నాకు ఆఫర్స్ రావడం లేదు.. హీరోయిన్ స్నేహా ఉల్లాల్..




