Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్, సిపోడియాకు బిగ్ రిలీఫ్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఢిల్లీ మాజీ సీఎం ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ భారీ ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆయనపై ఉన్న అభియోగాలను కొట్టివేస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది. అంతేకాదు ఆయనతో పాటు మనీష్ సిసోడియాపై ఉన్న అభియోగాలను కూడా తొలగించినట్టు పేర్కొంది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆభియోగాలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్‌చిట్ ఇచ్చింది. కేజ్రీవాల్‌తోపాటు ఢిల్లీ మాజీ మంత్రి సిసోడియాకు కూడా ఊరట లభించింది. ఆయనపై ఉన్న అభియోగాలను కూడా కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసు విచారణ సందర్భంగా సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో మెరిట్ లేదని రౌస్ అవెన్యూ కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్‌కు, సిసోడియాపై సీబీఐ మోపిన అన్ని అభియోగాలను కొట్టి వేస్తూ రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది.
ఇదిలా ఉండగా కోర్టు తీర్పుపై ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు.ఈ తీర్పు విన్న తర్వాత కేజ్రీవాల్ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆమ్‌ఆద్మీ పార్టీని నాశనం చేసేందుకే తనపై తప్పుడు అభియోగాలను మోపారని ఆరోపించారు. తాను ఏ తప్పు చేయలేదని.. కావాలనే తమపై తప్పుడు కేసులు పెట్టారని అన్నారు. తాను ,సిసోడియా, తమ పార్టీ నేతలంతా నిజాయితీపరులని చెప్పుకొచ్చారు. దేశంలో ఎన్నో సమస్యలున్నా.. వాటి మీద ఎన్నికల్లో పోరాడి గెలవాలి కాని.. ఇలా కాదని చెప్పుకొచ్చారు. ఎప్పటికైనా గెలిచేది సత్యం మాత్రమే అని కేజ్రీవాల్ చెప్పుకొరొచ్చారు.
ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్, మనీ లాండరింగ్ ఆరోపణలతో అరవింద్ కేజ్రీవాల్‌ను మార్చి 21, 2024న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఈ కేసులో 9 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కేజ్రీవాల్ విచారణకు హాజరు కాకపోవడంతో నేరుగా ఆయన ఇంటికి వెళ్లిన ఈడీ అధికారులు ఆయన్ను అరెస్ట్ చేశారు. అనంతరం తీహార్ జైలుకు తరలించారు. అయితే ఆయన తీహార్ జైల్లో ఉండగానే అవినీతి ఆరోపణ కేసులో జూన్ 26, 2024న సీబీఐ కూడా కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసింది.ఈ కేసులపై కేజ్రీవాల్‌ను సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ఆయనకు 2024 సెప్టెంబర్‌లో బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు తాజాగా ఈ కేసులో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
