AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Vitta: ఆ షూటింగ్స్‌కి వెళ్లడం కంటే.. అడ్డా మీద కూలీగా వెళ్లడం బెటర్..

కమెడియన్ మహేష్ విట్టా సీరియల్స్ ప్రొడక్షన్ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక వెబ్ సిరీస్ ద్వారా తనకున్న చేదు అనుభవాన్ని పంచుకుంటూ, సీరియల్స్ లో పనిచేయడం కన్నా కూలి పనులు చేసుకోవడం మేలని వ్యాఖ్యానించారు. షూటింగ్ సెట్స్‌లో మానవత్వం కొరవడుతుందని, చిత్ర పరిశ్రమ వెయ్యి రెట్లు మెరుగని ఆయన పేర్కొన్నారు.

Mahesh Vitta: ఆ షూటింగ్స్‌కి వెళ్లడం కంటే.. అడ్డా మీద కూలీగా వెళ్లడం బెటర్..
Mahesh Vitta
Ram Naramaneni
|

Updated on: Feb 27, 2026 | 8:54 AM

Share

కమెడియన్ మహేష్ విట్టా, సీరియల్స్ ప్రొడక్షన్ పనితీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీరియల్స్ కన్నా అడ్డ మీద కూలీ బెటర్ అంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో, తన కెరీర్, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ మద్దతు గురించి మాట్లాడారు. ఈ క్రమంలో, సీరియల్స్ ప్రొడక్షన్ పట్ల తనకున్న వ్యతిరేకతను బలంగా వ్యక్తం చేశారు. మహేష్ విట్టా మాట్లాడుతూ, ఒకప్పుడు ఆర్థిక సమస్యల కారణంగా సీరియల్స్ లోకి వెళ్లాలని ఆలోచించినట్లు తెలిపారు. అప్పుడు తన భార్య జాబ్ చేస్తూ కుటుంబానికి అండగా నిలిచారని, ఆమె సంపాదనతోనే ఇంటిని నడిపారని గుర్తు చేసుకున్నారు. మంత్లీ శాలరీ వస్తుంది కదా అని సీరియల్స్ లోకి వెళ్లాలనుకున్నప్పుడు, తన భార్య సినిమా అంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు. ముందు నువ్వు చేసిన సినిమా రిలీజ్ చేసుకో, ఆరు నెలలు చూడు. ఆ తర్వాత నీ ఇష్టమైన నిర్ణయం తీసుకో అని చెప్పిందని పేర్కొన్నారు. ఆమె ప్రోత్సాహంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు చెప్పారు. సీరియల్స్ పట్ల తనకున్న చేదు అనుభవాన్ని వివరిస్తూ.. తాను ఒక వెబ్ సిరీస్ చేశానని, అది సీరియల్ ప్రొడక్షన్ మాదిరిగానే ఉందని చెప్పారు. అక్కడ వాతావరణం ఘోరం, చాలా ఘోరం అని అభివర్ణించారు. మనుషులుగా కూడా చూడరు. అంత టార్చర్ ఉంటుంది. అంత గలీజుగా ఉంటుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అనుభవం తర్వాత సీరియల్స్‌కు దండం రా నాయనా అనిపించిందని అన్నారు.

తెలుగువాళ్లు ఆత్మాభిమానం ఎక్కువ కాబట్టే సీరియల్స్‌లో ఎక్కువమంది కనిపించరని, ఇతర భాషల వాళ్లే ఎక్కువగా పని చేస్తారని మహేష్ విట్టా అభిప్రాయపడ్డారు. సినిమాల్లో పనిచేయడం వెయ్యి రెట్లు మెరుగని, సీరియల్స్ ప్రొడక్షన్ తో పోలికే లేదని స్పష్టం చేశారు. తనకు ఒకే ఒక ప్రొడక్షన్ లో అలాంటి అనుభవం ఎదురైందని, అన్ని చోట్లా అలా ఉండకపోవచ్చని అన్నారు. అయినప్పటికీ, ఆ అనుభవంతో తనకు సీరియల్స్ అంటేనే భయం వేసిందని చెప్పారు. ఒకవేళ సినిమాల్లో అవకాశాలు రాకపోయినా, దోశల బండి పెట్టుకుంటా అని, అది కూడా మంచి బిజినెస్సే అని సరదాగా వ్యాఖ్యానించారు. ఇది సీరియల్స్ ప్రొడక్షన్ లోని పని వాతావరణంపై ఆయనకున్న తీవ్రమైన నిరాశను తెలియజేస్తుంది.

Also Read: తక్కువ ఖర్చుతో కోళ్లకు మేతగా పురుగులు ఇలా తయారు చేస్కోండి 

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర