Actress : సూపర్ స్టార్ మేనకోడలు.. తెలుగులో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి ఇప్పుడు ట్రావెల్ వ్లాగర్‌గా..
తెలుగులో ఒక్క సినిమాతోనే విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. కేవలం 18 ఏళ్ల వయసులోనే మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. ఆ తర్వాత హిందీ, తమిళం, తెలుగు సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ బ్లాగర్ గా పనిచేస్తుంది. తెలుగులో ఆమె చేసిన సినిమా అప్పట్లో భారీ విజయాన్ని సాధించింది.

తెలుగు సినిమాల్లో నటించి.. అందం, అభినయంతో ఓ ఊపు ఊపేసిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అందులో ఒక్క సినిమాతోనే పాపులర్ అయిన తారల గురించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ సైతం ఆ జాబితాలోకి చెందినవారే. బాలీవుడ్ లెజెండరి నటుడు ధర్మేంద్రకు సినిమా ప్రపంచంలో ఎంత పెద్ద కుటుంబం ఉందో చెప్పక్కర్లేదు. ఆయన కుటుంబంలోని మూడు తారలు ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు. సన్నీ డియోల్, బాబీ డియోల్, ఈషా డియోల్, అభయ్ డియోల్, ఆయన మనవడు కరణ్ డియోల్ సినిమాల్లో చురుగ్గా ఉన్నారు. అలాగే ఆయన మేనకోడలు పేరు దీప్తి భట్నాగర్. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.
ఇవి కూడా చదవండి : Hema Chandra: శ్రావణ భార్గవితో విడాకుల రూమర్స్.. హేమచంద్ర రియాక్షన్ ఇదే..
ధర్మేంద్ర మేనకోడలు… హిందీ, తెలుగులో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఒకప్పుడు మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి 18 ఏళ్లకే మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. దీప్తి ముంబైలోని ఒక హస్తకళల వ్యాపారంలో తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. 1995లో సంజయ్ గుప్తా దర్శకత్వం వహించిన రామ్ శాస్త్ర చిత్రంతో నటనా రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత 1996లో తెలుగులో శ్రీకాంత్ నటించిన పెళ్లి సందడి చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది.
ఇవి కూడా చదవండి : Actress : 50 సినిమాల్లో హీరోయిన్.. ఒక్కరోజులోనే కెరీర్ క్లోజ్.. అసలేం జరిగిందంటే..
తెలుగు, హిందీ భాషలలో పలు చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసింది దీప్తి. షారుఖ్ ఖాన్ తో ఒక ప్రకటనలో నటించిన తర్వాత.. ఆమెకు అవకాశాలు వచ్చాయి. ధర్మేంద్ర బంధువు వీరేంద్ర కుమారుడు రణదీప్ ఆర్యను వివాహం చేసుకుంది. వీరేంద్ర ఒక ప్రముఖ పంజాబీ సినీ నటుడు. వీరికి శుభ్, శివ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. సినిమాలకు దూరంగా ఉన్న దీప్తి.. ఇప్పుడు నిర్మాతగా మారారు. అలాగే సోషల్ మీడియాలో ట్రావెల్ వ్లాగర్ కూడా.

Deepti Bhatnagar
ఇవి కూడా చదవండి : Serial Actress : సినిమాల్లో హీరోయిన్ కావాలనుకుంది.. కట్ చేస్తే.. సీరియల్స్‌లో విలన్ అయ్యింది.. గ్లామర్ క్వీన్ రా బాబూ..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Amala Paul : ఆ సినిమాలో నటించి తప్పు చేశాను.. అప్పుడు నాకు 17 సంవత్సరాలే.. హీరోయిన్ అమలా పాల్..




