AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ప్రకాశ్ రాజ్ పక్కన రోల్ ఇస్తామని.. ఐదుగురికి కమిట్‌మెంట్ అడిగారు.. ఓపెన్‌గా చెప్పేసిన నటి..

నటి మిర్చి మాధవి 100% లవ్ సినిమా చేసిన తర్వాత ఎదురైన కాంప్రమైజ్ ఆఫర్‌ను తిరస్కరించిన వైనాన్ని వివరించారు. చిత్ర పరిశ్రమలో తన స్వభావం, సహనటుల నుంచి ఎదురైన కెమెరా సిండ్రోమ్ వంటి సవాళ్లను, అలాగే ప్రభాస్, అల్లు అర్జున్ వంటి స్టార్లతో పనిచేసిన అనుభవాలను ఆమె పంచుకున్నారు.

Tollywood: ప్రకాశ్ రాజ్ పక్కన రోల్ ఇస్తామని.. ఐదుగురికి కమిట్‌మెంట్ అడిగారు.. ఓపెన్‌గా చెప్పేసిన నటి..
Mirchi Madhavi
Ram Naramaneni
|

Updated on: Nov 29, 2025 | 5:35 PM

Share

క్యారెక్టర్ ఆర్టిస్ట్ తెలుగు సినీ ఫీల్డ్‌లో మంచి పేరు తెచ్చుకున్నారు మాధవి. ముఖ్యంగా మిర్చి సినిమాలో ఆమె రోల్ బాగా పండింది. అప్పట్నుంచి ఆమెను మిర్చి మాధవి పిలవడం కామన్ అయిపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాధవి.. తన సినీరంగ ప్రయాణంలో ఎదురైన కీలక సంఘటనలను, వ్యక్తిగత వైఖరిని వివరించారు. 100% లవ్ సినిమా చేసిన తర్వాత, భాస్కర్ అనే వ్యక్తి ఫోన్ చేసి ప్రకాష్ రాజ్ పక్కన భార్య పాత్ర కోసం ఐదుగురితో కాంప్రమైజ్ అవ్వమని అడిగారని మాధవి వెల్లడించారు. అలాంటి ఆఫర్‌ను తాను వెంటనే తిరస్కరించానని, అలాంటి పనులకు తాను సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. ఇది సినీ పరిశ్రమలోనే కాకుండా ప్రతిచోటా ఉన్నప్పటికీ, లైమ్‌లైట్‌లో ఉన్నవారికి మాత్రమే బయటపడుతుందని ఆమె అన్నారు.

ఇక 100% లవ్ సెట్‌లో తనకు ఎంతో మధురు అనుభవాలు ఉన్నాయని మాధవి గుర్తు చేసుకున్నారు. దర్శకుడు సుకుమార్ తనను సెలక్ట్ చేశారని, 25 రోజులు ఎంతో సరదాగా పనిచేశామని తెలిపారు. ఆ సమయంలో పిల్లలందరినీ ఆడిస్తూ, చాలా ఫన్‌గా ఉండేదని, సాత్విక్ (ఇప్పుడు హీరో) చిన్నపిల్లాడిలా ఉండేవాడని పేర్కొన్నారు. అక్కడ తానెదో కమిట్మెంట్ ఇచ్చినట్లు.. ఫోన్ చేసిన వ్యక్తి మాట్లాడరని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో ఎదురయ్యే ఇతర సవాళ్లను కూడా ఆమె ప్రస్తావించారు. కొందరు తోటి నటీనటులు కెమెరా సిండ్రోమ్‌తో బాధపడుతూ, కెమెరా ముందు నిలబడటానికి తోసుకోవడం, భుజాలు రబ్ చేయడం వంటివి చేస్తారని వివరించారు. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుందని, తమ వ్యక్తిగత హద్దులు క్రాస్ చేసినట్లు అనిపిస్తుందని తెలిపారు. పనిని వదులుకోలేం.. కాబట్టి ఇలాంటివి భరించాల్సి వస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎవడు సినిమా షూటింగ్‌లో ఒక జూనియర్ ఆర్టిస్ట్ తనను కవర్ చేస్తున్నారని ఫిర్యాదు చేయగా, సీనియర్ నటి రజిత జోక్యం చేసుకొని దర్శకుడు చెప్పిన స్థానంలో ఉండాలని సలహా ఇచ్చారని మాధవి గుర్తు చేసుకున్నారు.

తన వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడుతూ, తాను చాలా ఆత్మవిశ్వాసంతో, నిగర్వంగా ఉంటానని తెలిపారు. ఆత్మవిశ్వాసం ఉన్న స్త్రీలను కొందరు భరించలేరని ఆమె అన్నారు. ఇతరుల సంపద చూసి మురిసిపోనని, లేదా లేనివారిని చులకన చేయనని ఆమె స్పష్టం చేశారు. అతుకుమేళాలు, చీప్ ట్రిక్స్ తన స్వభావంలో లేవని, ఈ కారణంగానే పరిశ్రమలో చాలామంది తనను అర్థం చేసుకోవడానికి సమయం పడుతుందని వివరించారు.

ప్రముఖ హీరోలతో పనిచేసిన అనుభవాల గురించి మాట్లాడుతూ, మిర్చి సినిమాలో ప్రభాస్‌తో పనిచేసినప్పుడు ఆయన సింప్లిసిటీని ప్రశంసించారు. ఒక డైలాగ్ డెలివరీకి ప్రభాస్ నుంచి తాను ప్రశంసలు అందుకున్నట్లు తెలిపారు. రామ్ చరణ్‌తో ఎవడులో, అల్లు అర్జున్‌తో ఐదు చిత్రాలలో నటించానని పేర్కొన్నారు. అల్లు అర్జున్‌ను స్వీట్‌హార్ట్, డౌన్ టు ఎర్త్ అని మాధవి చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్‌తో తప్ప మిగిలిన పాన్ ఇండియా స్టార్స్‌తో పనిచేశానని అన్నారు. ఈ తరం హీరోలు చాలా చక్కగా, కల్చర్డ్‌గా ఉంటున్నారని ఆమె వ్యాఖ్యానించారు. తెలుగుతో పాటు, తమిళంలో రెండు, భోజ్‌పురిలో ఒకటి, కన్నడలో ఒక చిత్రంలో నటించినట్లు మాధవి తెలిపారు. కొత్త ప్రాజెక్టులు చేతికి వచ్చే వరకు నమ్మకం లేదని, కెమెరా ముందు నిలబడితేనే అది ప్రాజెక్ట్ అని భావిస్తానని ఆమె వ్యాఖ్యానించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రేపట్నుంచే TSLPRB APP రాత పరీక్షల అడ్మిట్‌ కార్డులు.. లింక్ ఇదే
రేపట్నుంచే TSLPRB APP రాత పరీక్షల అడ్మిట్‌ కార్డులు.. లింక్ ఇదే
ఆర్బీఐ కీలక ప్రకటన.. ఈఎంఐలు కట్టేవారికి శుభవార్త
ఆర్బీఐ కీలక ప్రకటన.. ఈఎంఐలు కట్టేవారికి శుభవార్త
పుతిన్ పర్యటన వేళ ప్రధాని మోదీ పాత చిత్రం వైరల్!
పుతిన్ పర్యటన వేళ ప్రధాని మోదీ పాత చిత్రం వైరల్!
"నీ బుర్ర వాడకు, నేను చెప్పింది చేయి..": కేఎల్ రాహుల్ ఫైర్
ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు ఊహించని రీతిలో..
ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు ఊహించని రీతిలో..
తెలంగాణలో వచ్చే జూన్‌ నాటికి లక్ష ఉద్యోగాలు.. నిరుద్యోగులకు పండగే
తెలంగాణలో వచ్చే జూన్‌ నాటికి లక్ష ఉద్యోగాలు.. నిరుద్యోగులకు పండగే
నెంబర్ టైప్ చేస్తే చాలు ..మీ లైవ్ లొకేషన్ వస్తుంది.. డేంజర్..
నెంబర్ టైప్ చేస్తే చాలు ..మీ లైవ్ లొకేషన్ వస్తుంది.. డేంజర్..
జైలులో స్నేహం.. మాంచి ప్లాన్‌తో బయటకు వచ్చారు.. కట్ చేస్తే..
జైలులో స్నేహం.. మాంచి ప్లాన్‌తో బయటకు వచ్చారు.. కట్ చేస్తే..
అమ్మకానికి ప్రభుత్వ బ్యాంకు..! రూ.64 వేల కోట్ల టార్గెట్‌!
అమ్మకానికి ప్రభుత్వ బ్యాంకు..! రూ.64 వేల కోట్ల టార్గెట్‌!
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..