AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా? 55 ప్లస్‌లోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు.. ఇప్పటికీ అదే అందం

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఏలేసిందీ అందాల తార. స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అయితే మధ్యలో సడెన్ గా మాయమైపోయింది. ఇప్పుడు మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ లో సహాయక నటిగా బిజీ బిజీగా ఉంటోంది.

Tollywood: ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?  55 ప్లస్‌లోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు.. ఇప్పటికీ అదే అందం
Tollywood Actress
Basha Shek
|

Updated on: Nov 29, 2025 | 5:59 PM

Share

పై ఫొటోలో క్యూట్ గా కనిపిస్తోన్న హీరోయిన్ ను గుర్తు పట్టారా? ఆమె ఒకప్పుడు స్టార్ హీరోయిన్. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ సినిమాలు చేసింది. స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో నటించిందీ అందాల తార. తన అందం, అభినయంతో కుర్రకారును కట్టిపడేసింది. అయితే సినిమా కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుంది. భర్తతో కలిసి విదేశాలకు వెళ్లిపోయింది. చాలా ఏళ్ల పాటు అక్కడే ఉండిపోయింది. అయితే పిల్లలు కాస్త పెద్దదైన తర్వాత మళ్లీ ఇండియాకు వచ్చింది. సినిమాల్లో సెకెండ్ ఇన్నింగ్స్ షురూ చేసింది. ప్రభాస్, పవన్ కల్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, వెంకటేష్, మోహన్ లాల్.. ఇలా ఎందరో స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. ఒకప్పుడు హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ అందాల తార ఇప్పుడు స్టార్ హీరోలు, హీరోయిన్లకు అమ్మగా, అత్తమ్మగా నటిస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ ఈ నటికి ఫుల్ క్రేజ్ ఉంది. ఆమె షేర్ చేసే ఫొటోలు, వీడియోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంటుంది. అలా తాజాగా తన త్రో బ్యాక్ ఫొటో ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిందీ అందాల తార. ఇప్పుడది నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఆ నటి ఎవరో గుర్తు పట్టారా? కష్టంగా ఉందా? అయితే సమాధానం కూడా మేమే చెబుతాం లెండి. ఆ నటి మరెవరో కాదు అత్తారింటికి దారేది ఫేమ్ నదియా.

కాగా నదియా ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ సినిమాల్లో స్టార్‌ హీరోల సరసన నటించారు. రజనీకాంత్, మోహన్‌లాల్‌, విజయకాంత్, సత్యరాజ్, ప్రభు, సురేష్ వంటి టాప్ హీరోలతో కలిసి నటించింది. అయితే సినిమాల్లో ఉండగానే 1988లో అమెరికన్ బిజినెస్ మ్యాన్ శిరీష్ గాడ్ బోల్‌ను వివాహం చేసుకుంది నదియా. ఆతర్వాత ఫ్యామిలిలీతో కలిసి యూఎస్‌కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. కాగా ఈ దంపతులకు 1996లో సనమ్‌ అనే కుమార్తె పుట్టింది. ఆతర్వాత ఐదేళ్లకు అంటే 2001లో రెండో అమ్మాయి జానా వీరి జీవితంలోకి అడుగుపెట్టింది. 2008లో తన ఫ్యామిలీతో కలిసి ఇండియాకు తిరిగొచ్చింది నదియా. మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యింది.

ఇవి కూడా చదవండి

నదియా లేటెస్ట్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పైసా ఖర్చు లేకుండా నెలకు రూ.9250 ఆదాయం.. ఈ సూపర్ స్కీమ్..
పైసా ఖర్చు లేకుండా నెలకు రూ.9250 ఆదాయం.. ఈ సూపర్ స్కీమ్..
ఓటీటీలోకి రోజా రీ ఎంట్రీ సినిమా.. కడుపుబ్బా నవ్వుకోవచ్చు
ఓటీటీలోకి రోజా రీ ఎంట్రీ సినిమా.. కడుపుబ్బా నవ్వుకోవచ్చు
ఎలాన్‌ మస్క్‌ రోజుకు ఎంత సంపాదిస్తారో తెలిస్తే బిత్తరపోతారు..!
ఎలాన్‌ మస్క్‌ రోజుకు ఎంత సంపాదిస్తారో తెలిస్తే బిత్తరపోతారు..!
పాత చీపురు పడేస్తున్నారా..? ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
పాత చీపురు పడేస్తున్నారా..? ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
ఇంట్లో గాజు పగిలితే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
ఇంట్లో గాజు పగిలితే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
ఫ్రీ.. ఫ్రీ.. కోళ్ళను ఎత్తుకెళ్లేందుకు బస్తాలే తీసుకొచ్చారు..
ఫ్రీ.. ఫ్రీ.. కోళ్ళను ఎత్తుకెళ్లేందుకు బస్తాలే తీసుకొచ్చారు..
కోహ్లీ ఫీల్డింగ్ ఎనర్జీకి ఇదే నిదర్శనం
కోహ్లీ ఫీల్డింగ్ ఎనర్జీకి ఇదే నిదర్శనం
ప్రకృతితో ముడిపడిన జీవితాలు.. హిమాలయ వాసులపై సద్గురు..
ప్రకృతితో ముడిపడిన జీవితాలు.. హిమాలయ వాసులపై సద్గురు..
కోతితో రీల్స్ చేసి చిక్కుల్లో పడ్డ విక్రమ్.. వీడియో దుమారం
కోతితో రీల్స్ చేసి చిక్కుల్లో పడ్డ విక్రమ్.. వీడియో దుమారం
ఒక్క ఏడాదిలోనే మూతపడిన 10 వేల ప్రభుత్వ బడులు.. ఈ లెక్కలు చూస్తే..
ఒక్క ఏడాదిలోనే మూతపడిన 10 వేల ప్రభుత్వ బడులు.. ఈ లెక్కలు చూస్తే..