Amala Paul : ఆ సినిమాలో నటించి తప్పు చేశాను.. అప్పుడు నాకు 17 సంవత్సరాలే.. హీరోయిన్ అమలా పాల్..
దక్షిణాది సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు అమలా పాల్. మైనా సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు తెలుగు, తమిళం, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

అమలా పాల్.. సినీప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగులో ఇద్దరమ్మాయిలతో.. నాయక్ వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. విభిన్న కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే దర్శకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ కొన్నాళ్లకే విడాకులు తీసుకుంది. ఆ తర్వాత తిరిగి సినిమా రంగంలోకి అడుగుపెట్టినప్పటికీ అంతగా అవకాశాలు రాలేదు. కొన్నాళ్ల క్రితమే తన స్నేహితుడిని వివాహం చేసుకుని సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం ఆమెకు బాబు ఉన్నాడు. గతంలో అమలా పాల్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ వైరలవుతున్నాయి.
ఇవి కూడా చదవండి : Cinema : ఇదెక్కడి సినిమా రా బాబూ.. 45 కోట్లు పెట్టి తీస్తే రూ.60 వేల కలెక్షన్స్ రాలేదు.. నిర్మాతలను నిండా ముంచేసింది..
అమలా పాల్ కెరీర్‌లో అత్యంత కష్టతరమైన సినిమాల్లో సింధు సమవేలి చిత్రం ఒకటి. ఈ మూవీ అప్పట్లో వివాదాలకు కారణమైంది. ఇందులో ఆమె పోషించిన బోల్డ్ పాత్ర పై విమర్శలు వచ్చాయి. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో తాను నటించిన సింధు సమవేలి సినిమా గురించి మాట్లాడింది అమలా పాల్. “ఆ సినిమాలో నటించడం ద్వారా నేను తప్పు చేశాను. ఆ సమయంలో నాకు 17 ఏళ్లే. దర్శకుడు చెప్పినది విన్నాను. తర్వాత నా తప్పు నాకు అర్థమైంది. ఆ తర్వాత అలాంటి పాత్ర ఎప్పటికీ చేయకూడదని అర్థమైంది. సినిమాల్లో చాలా నేర్చుకుంటాము. ఆ సినిమా విడుదలైనప్పుడు నాకు చాలా భయం వేసింది, దానికి నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఆ సినిమా చూసిన తర్వాత నాన్న కూడా బాధపడ్డాడు. ఈ సినిమా తన కెరీర్‌ని, వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేసిందని ఆయన అన్నారు” అంటూ చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి : Prithviraj Sukumaran : ఏంటీ.. ఈ స్టార్ హీరో భార్య టాప్ జర్నలిస్టా.. ? ఫోన్ కాల్తో ప్రేమకథ.. లవ్ స్టోరీలో సినిమాను మించిన ట్విస్టులు..
ప్రస్తుతం అమలా పాల్ సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన కొడుకు ఫోటోస్ షేర్ చేస్తుంది. అలాగే గ్లామర్ ఫోటోషూట్లతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది.
ఇవి కూడా చదవండి : Nani : నానితో జెర్సీ సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా.. ? చివరకు ఆ హీరోతో బ్లాక్ బస్టర్..




