Serial Actress : సినిమాల్లో హీరోయిన్ కావాలనుకుంది.. కట్ చేస్తే.. సీరియల్స్‌లో విలన్ అయ్యింది.. గ్లామర్ క్వీన్ రా బాబూ..
నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలతో సినీరంగంలోకి అడుగుపెడుతుంటారు. కానీ కొందరు మాత్రమే సక్సెస్ అవుతుంటారు. ఒకటి రెండు చిత్రాలతో స్టార్ స్టేటస్ సంపాదించుకున్న తారలు ఉండగా.. మరికొందరు సెకండ్ హీరోయిన్లుగా సెటిల్ అవుతారు. కానీ ఈ నటి మాత్రం బుల్లితెరపైకి షిఫ్ట్ అయ్యింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

సాధారణంగా హీరోయిన్లకు ధీటుగా సీరియల్ తారలకు సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. బుల్లితెరపై సీరియల్లో ప్రధాన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులకు దగ్గరైన నటీమణులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ అమ్మడు మాత్రం సినిమాల్లో హీరోయిన్ కావాలనుకుంది. అదే కోరికతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కానీ సరైన అవకాశం రాకపోవడంతో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు.. సీరియల్ లోనూ హీరోయిన్ కాలేదండి.. అందమైన విలన్ గా మారింది. ప్రస్తుతం స్మాల్ స్క్రీన్ పై పూర్తిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తుంది. కానీ అందం, గ్లామర్ విషయంలో మాత్రం ఆమె నెట్టింట సెన్సేషన్. అచ్చ తెలుగమ్మాయి. ప్రస్తుతం ఆమె నటిస్తున్న సీరియల్ బుల్లితెరపై అత్యధిక టీఆర్పీ అందుకుంటుంది. అలాగే తన నటనతోనూ జనాలకు దగ్గరవుతుంది ఈ ముద్దుగుమ్మ.
ఇవి కూడా చదవండి : Cinema : ఇదెక్కడి సినిమా రా బాబూ.. 45 కోట్లు పెట్టి తీస్తే రూ.60 వేల కలెక్షన్స్ రాలేదు.. నిర్మాతలను నిండా ముంచేసింది..
హీరోయిన్లకు మించి అందం.. అమ్మాయిలు సైతం కుళ్లుకునే గ్లామర్ ఈ అమ్మడు సొంతం. ప్రస్తుతం బుల్లితెరపై బ్యూటీఫుల్ విలన్.. నెట్టింట సంచలనం.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా.. ? ఆమె పేరు గాయత్రి సింహాద్రి. ఈ పేరు చెబితే అసలు గుర్తుపట్టలేరు కానీ.. జ్యోత్స్న అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. అవునండి.. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న కార్తీక దీపం 2 సీరియల్ ఫేమ్ జ్యోత్న్స. ఈ సీరియల్లో నెగిటివ్ షెడ్స్ ఉన్న విలన్ పాత్రలో నటిస్తుంది. జ్యోత్న్స అందం.. విలన్ యాక్టింగ్ జనాలను ఆకట్టుకుంటున్నాయి. సీరియల్లో విలన్ గా మెప్పిస్తున్న ఈ ముద్దుగుమ్మ నెట్టింట మాత్రం అటామ్ బాంబ్.
ఇవి కూడా చదవండి : Prithviraj Sukumaran : ఏంటీ.. ఈ స్టార్ హీరో భార్య టాప్ జర్నలిస్టా.. ? ఫోన్ కాల్‌తో ప్రేమకథ.. లవ్ స్టోరీలో సినిమాను మించిన ట్విస్టులు..
విజయవాడకు చెందిన ఈ అమ్మడు.. హీరోయిన్ కావాలనుకుని సినీరంగంలోకి అడుగుపెట్టింది. మ్యాడ్ సినిమాలో చిన్న పాత్ర పోషించింది. ఆ తర్వాత అంతగా అవకాశాలు రాలేదు. దీంతో బుల్లితెరకు షిఫ్ట్ అయ్యింది. ఇప్పుడు కార్తీక దీపం 2 సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇవి కూడా చదవండి : Nani : నానితో జెర్సీ సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా.. ? చివరకు ఆ హీరోతో బ్లాక్ బస్టర్..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Tollywood : కుర్రాళ్లకు మెంటలెక్కించిన హీరోయిన్.. కట్ చేస్తే.. అవకాశాల కోసం ఎదురుచూపులు..




