మార్చిలో పాన్ ఇండియా సినిమాల రచ్చ.. అంతా కన్ఫ్యూజనే
సినిమా విడుదల తేదీలు ప్రకటించి వాయిదాలు వేయడం సాధారణం. 2026 మార్చిలో రానున్న పెద్ది, ప్యారడైజ్, టాక్సిక్ సినిమాల విషయంలోనూ ఇదే గందరగోళం నెలకొంది. పెద్ది మార్చి 27న కన్ఫర్మ్ కాగా, ప్యారడైజ్, టాక్సిక్ షూటింగ్‌లో జాప్యం కారణంగా అనుమానాలున్నాయి. పాన్ ఇండియా చిత్రాలకు ముందుగా ప్రమోషన్ తప్పనిసరి.
ఆర్నెళ్ళ ముందు రిలీజ్ డేట్ ప్రకటించడం గొప్ప కాదు.. ప్రకటించిన డేట్‌కు వచ్చినపుడే గొప్ప. ఈ మధ్య ఇది చాలా తక్కువ సినిమాలకు మాత్రమే సాధ్యమవుతుంది. ముందైతే డేట్ ఇస్తున్నారు గానీ చెప్పిన సమయానికి వస్తున్నది మాత్రం తక్కువే. తాజాగా 2026 మార్చిలో రాబోయే సినిమాల విషయంలో ఇలాంటి కన్ఫ్యూజనే ఉంది. మరి ఏంటా సినిమాలు.. ఆ కన్ఫ్యూజన్ ఏంటి..? ప్యాన్ ఇండియన్ కల్చర్ మొదలయ్యాక.. ఆర్నెళ్ళ ముందే ప్రమోషన్ మొదలు పెట్టకపోతే కష్టమే. మేమొస్తున్నాం అని పదే పదే గుర్తు చేయాల్సిందే. లేదంటే గ్యాప్‌లో ఇంకొకరు దూరిపోతుంటారు. అందుకే పెద్ది సినిమాకు 5 నెలల ముందే ప్రమోషన్ షురూ చేసారు. చికిరీ పాటతో ఇండియా అంతా మార్మోగిపోతుందిప్పుడు.. దానికి ముందే ఓ టీజర్ కూడా ఇచ్చారు బుచ్చిబాబు. మార్చి 27న పెద్ది విడుదల కన్ఫర్మ్.. దానికి తగ్గట్లుగానే ప్రమోషన్, షూటింగ్ నడుస్తున్నాయి. అయితే దానికి ఒక్కరోజు ముందు వస్తానంటున్న ప్యారడైజ్ విషయంలోనే డౌట్స్ వస్తున్నాయిప్పుడు. మామూలుగా నాని ఓసారి చెప్తే ఫిక్స్ అంతే. కానీ ప్యారడైజ్ షూట్ కాస్త ఆలస్యమవుతున్నట్లు అనిపిస్తుంది.. మరి మార్చి 26కి వస్తారా అనేది సస్పెన్స్. మేకర్స్ మాత్రం పక్కా వస్తామంటున్నారు. ప్యారడైజ్ మాత్రమే కాదు.. మార్చి 19న రానున్న యశ్ టాక్సిక్ రిలీజ్ విషయంలోనూ గందరగోళం తప్పట్లేదు. దీని షూటింగ్ ఇంకా నడుస్తూనే ఉంది. షూట్ అప్‌డేట్ ప్రకారం చూస్తే.. మార్చి 19న టాక్సిక్ రావడం కాస్త కష్టమే. కానీ కచ్చితంగా వస్తామంటున్నారు మేకర్స్. ఏదేమైనా పెద్ది అయితే రేసులోనే ఉంది. మిగిలిన ప్యారడైజ్, టాక్సిక్ రేసులో ఉన్నాయా లేదా అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చనిపోయిన తల్లిలా వేషం వేసిన కొడుకు.. మూడేళ్లుగా రూ. 80 లక్షల పింఛను కోసం నాటకం
Hongkong: అపార్ట్‌మెంట్లలో అగ్నికీలలు పన్నెండు మంది మృతి.. లోపలే చిక్కుకున్న వందలాది మంది
చెవిపోగులు తాకట్టు పెట్టింది.. కట్ చేస్తే కటిక పేదరికం నుండి పెద్ద ధనవంతురాలు అయ్యింది
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

